Mon Dec 23 2024 18:10:45 GMT+0000 (Coordinated Universal Time)
ఒమిక్రాన్ ముప్పు తప్పదు - డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక
ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ సంచలన ప్రకటన చేశారు
ప్రపంచ దేశాలన్నింటినీ వణికిస్తోన్న కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ సంచలన ప్రకటన చేశారు. ఒమిక్రాన్ తన గమనాన్ని ఎలా కాలావంటే అలా మార్చుకోగలదని తెలిపారు. వేగంగా వ్యాపించడంతో పాటు అసాధారణ మ్యుటేషన్లు కలిగి ఉన్న ఒమిక్రాన్ భవిష్యత్ లో భారీ ప్రభావాన్ని చూపే సంకేతాలు కనిపిస్తున్నాయని హెచ్చరించారు. డెల్టా వేరియంట్ కన్నా ఒమిక్రాన్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ.. దీనిపై అప్పుడు ఒక అభిప్రాయానికి రావడం తొందరపాటే అవుతుందన్నారు. ప్రమాదం ఎక్కువగా లేదు కదా అని ఒమిక్రాన్ ను లైట్ తీసుకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
వ్యాక్సినేషన్ ను...
అన్నిదేశాల్లోనూ వీలైనంత మేరకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయడం, వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సంక్షోభం నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చన్నారు. రెండేళ్లలో వచ్చిన వేరియంట్ల కన్నా ఒమిక్రాన్ వేరియంట్ ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించడంతో.. చాలా దేశాలు మళ్లీ ఆంక్షలను అమలు చేశాయి. ఇప్పటికే ఈ వేరియంట్ 57 దేశాలను చుట్టేసిందంటే.. అందరికీ వ్యాపించేందుకు ఎక్కువ సమయం లేదని, జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదం తప్పని టెడ్రోస్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. సెకండ్ వేవ్ మిగిల్చిన నష్టాల నుంచి ఇంకా తేరుకోకుండానే.. దేశంలో థర్డ్ వేవ్ ముప్పు తప్పదన్న హెచ్చరికలు అందరి గుండెల్లో గుబులు రేపుతున్నాయి.
Next Story