ఒక్క మామిడి.. 40వేల రూపాయలా
అయితే ఒక్క మామిడి పండు ధర 40000 రూపాయలు అంటే కొనడానికే కాదు.. తినడానికి కూడా భయపడుతూ ఉంటాం
సమ్మర్ వచ్చిందంటే మామిడి పండ్ల సీజన్ వచ్చేసినట్లే..! మామిడి పండ్లు అంటే ఇష్టం ఉన్న వాళ్లు ఈ సీజన్ ను బాగా ఎంజాయ్ చేస్తారు. మార్కెట్ లో దొరికే వెరైటీలను బట్టి కొనుక్కుని తినేస్తూ ఉంటారు. అయితే ఒక్క మామిడి పండు ధర 40000 రూపాయలు అంటే కొనడానికే కాదు.. తినడానికి కూడా భయపడుతూ ఉంటాం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు రకమైన 'మియాజాకి' ని తినాలంటే 40000 రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కర్ణాటకలోని కొప్పల్‌లోని మామిడి పండ్ల మేళాలో ఈ మామిడి పండు ప్రదర్శనకు వచ్చింది. ఒక్కో పండు రూ. 40,000 (కిలో రూ. 2.5 లక్షలు) ధర ఉందని చెప్పడంతో మేళాకు వచ్చిన వాళ్లు కాస్తా షాక్ అవుతున్నారు. కొప్పల్ జిల్లాలో మియాజాకి సాగును ప్రాచుర్యంలోకి తీసుకురావాలని ఉద్యాన శాఖ యోచిస్తోంది. మేళాలో ప్రదర్శన కోసం హార్టికల్చర్ అధికారులు మధ్యప్రదేశ్ నుండి ఒక మియాజాకి మామిడిని మాత్రమే తీసుకువచ్చారు. ఈ రకాన్ని జపాన్‌లో ఎక్కువగా పండిస్తారు.