Mon Dec 23 2024 16:07:32 GMT+0000 (Coordinated Universal Time)
రెండోసారి సీఎంగా యోగి
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాద్ ప్రమాణ స్వీకారం చేశారు. రెండోసారి ఆయన యూపీ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాద్ ప్రమాణ స్వీకారం చేశారు. రెండోసారి ఆయన యూపీ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. లక్నోలోని వాజ్ పేయి స్టేడియంలో కిక్కిరిసిన పార్టీ కార్యకర్తలు, అభిమానుల మధ్య ఆయన ప్రమాణస్వీకారం చేశారు. 52 మంది కొత్త మంత్రివర్గంతో యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వం యూపీలో కొలువుదీరింది. అలాగే ఉప ముఖ్యమంత్రులుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ లు ప్రమాణస్వీకారం చేశారు.
మంత్రివర్గంలోకి.....
మొన్నటి ఎన్నికల్లో కేశవ్ ప్రసాద్ మౌర్య ఓటమి పాలయ్యారు. అయినా ఆయనను మంత్రివర్గంలోకి తీసుకుని డిప్యూటీ సీఎంగా ఎంపిక చేశారు. గత కేబినెట్ లో ఉన్న 20 మందికి ఈసారి కేబినెట్ లోకి తీసుకోలేదు. యోగి ఆదిత్యానాధ్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు ముఖ్య నేతలు హాజరయ్యారు.
Next Story