Mon Dec 23 2024 15:39:06 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సీఎంగా యోగి ప్రమాణ స్వీకారం
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాధ్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాధ్ నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన సాయంత్రం నాలుగు గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉత్తర్ ప్రదేశ్ లో రెండోసారి వరసగా అధికారంలోకి వచ్చి బీజేపీ రికార్డు సృష్టించింది. దీంతో కేంద్ర నాయకత్వం కూడా యోగి ఆదిత్యానాధ్ కే మరోసారి ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలను అప్పగించాలని నిర్ణయించారు. దీంతో రెండోసారి యోగి ఆదిత్యానాధ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
వారికి సన్మానం...
ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నోలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్కక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరుకానున్నారు. యూపీలో బీజేపీ విజయం కోసం ప్రచారం చేసిన కేంద్ర మంత్రులను, పార్టీనేతలను యోగి ఆదిత్యానాధ్ సన్మానించనున్నారు.
Next Story