Mon Dec 23 2024 15:52:29 GMT+0000 (Coordinated Universal Time)
యోగి ప్రమాణస్వీకారం అప్పుడేనట
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ ఈ నెల 25న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ముహూర్తం ఫిక్స్ అయింది.
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ ఈ నెల 25వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఉత్తర్ ప్రదేశ్ లో వరసగా రెండోసారి బీజేపీ విజయం సాధించి రికార్డు సృష్టించింది. యోగి ఆదిత్యానాధ్ కూడా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టబోతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించి బీజేపీ అధికారంలోకి వచ్చింది.
యోగితో పాటు .....
అయితే ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాధ్ ప్రమాణస్వీకారం చేయడానికి మొన్నటి వరకూ ముహూర్తం కుదరలేదు. ఈ నెల 25వ తేదీన ఆయన సీఎంగా బాధ్యతలను చేపట్టనున్నారు. లక్నో లోని అటల్ బిహారీ వాజ్ పేయి మైదానంలో ఈ ప్రమాణస్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. యోగి ఆదిత్యానాధ్ తో పాటు మరో 19 మంది వరకూ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Next Story