Fri Dec 20 2024 22:38:06 GMT+0000 (Coordinated Universal Time)
Jack Pot : గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్న కుర్రోడికి జాక్ పాట్ తగిలిందే
గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్న ఒక యువకుడికి జాక్ పాట్ తగిలింది. కోటిన్నర ప్రైజ్ మనీ వచ్చింది.
గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్న ఒక యువకుడికి జాక్ పాట్ తగిలింది. కోటిన్నర ప్రైజ్ మనీ వచ్చింది. దీంతో ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు తీరినట్లే నని సంబరపడిపోతున్నారు. బీహార్ లోని అరారియా జిల్లా పటేగానా గ్రామానికి చెందిన సాధిఖ్ గ్యాస్ ఏజెన్సీలో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఇంటింటికీ గ్యాస్ బండ ఇచ్చే సాధిఖ్ జీతం నెలకు పదివేల రూపాయలు మాత్రమే. నిరుపేద కుటుంబంలో తాను సంపాదించే పదివేల రూపాయలు ఆదుకుంటాయని భావించి అతడు ఈ ఉద్యోగం ఇష్టం లేకపోయినా చేస్తున్నాడు.
క్రికెట్ పిచ్చి ఉండటంతో...
అయితే అతనికి మరొక పిచ్చి ఉంది. అదే క్రికెట్. క్రికెట్ అంటే సాదిఖ్ కు విపరీతమైన పిచ్చి. దీంతో ఈ నెల 14వ తేదీన ఇండియా - ఆప్ఘనిస్తాన్ మధ్య జరిగిన టీ 20 మ్యాచ్ సమయంలో కేవలం నలభై తొమ్మిది రూపాయలు సంపాదించి డ్రీమ్-11లో ఆడాడు. అంతే మొదటి స్థానంలో నిలిచి కోటిన్నర గెలుచుకున్నాడు. అయితే గెలుచుకున్న మొత్తాన్ని వెంటనే ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లు సాదిఖ్ పనిచేస్తున్న గ్యాస్ ఏజెన్సీ యజమాని జితేంద్ర తెలిపారు. అతని కుటుంబానికి నెలవారీ వచ్చే వడ్డీతో గడిచిపోతుందని చెప్పాడు.
Next Story