Mon Nov 25 2024 21:03:47 GMT+0000 (Coordinated Universal Time)
YSRCPProtestsInDelhi: వైసీపీ ఢిల్లీ ధర్నాలోకి ఆయన.. అందరూ షాక్!!
ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత జగన్
ఏపీలో వైసీపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జంతర్ మంతర్ వద్ద చేస్తోన్న దీక్షకు ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ సంఘీభావం తెలిపారు. ఏపీలో తమ పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ దాడులు చేస్తోందంటూ అఖిలేశ్‌కు జగన్ వీడియోలు చూపించారు. విపక్షాలపై అరాచకాలు సృష్టించడం సరికాదన్నారు అఖిలేష్ యాదవ్. ఒకరి ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదని.. ఇతర పక్షాలపై హింసకు దిగడం సరికాదన్నారు. ప్రాణాలు తీయడం, హత్యలు చేయడం ప్రజాస్వామ్యంలో చెల్లవని తెలిపారు.
ఏపీలో ఈరోజు జగన్ అధికారంలో లేకపోవచ్చు, రేపు రావొచ్చని.. కానీ ప్రతిపక్షాలపై దాడులు సరికాదని అఖిలేశ్ యాదవ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ప్రజాస్వామ్యంలోకి కొత్తగా బుల్డోజర్ సంస్కృతి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీలోను ఏపీ వంటి పరిస్థితులే నెలకొన్నాయని.. బుల్డోజర్ సంస్కృతికి తాము వ్యతిరేకమని అఖిలేశ్ తెలిపారు. అత్యంత కఠిన పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తల కోసం జగన్ పోరాడుతున్నారన్నారు. ఏ పార్టీకి అయినా కార్యకర్తలే బలం అన్నారు.
Next Story