Fri Dec 20 2024 22:38:30 GMT+0000 (Coordinated Universal Time)
సంచలన నిర్ణయం తీసుకున్న ZOOM.. ఏకంగా అధ్యక్షుడి తొలగింపు
ఆ సమయంలోనే జూమ్ సీఈఓ ఎరిక్ యువాన్ తన జీతంలోనూ 98 శాతం కోతతో పాటు, ప్రతి సంవత్సరం అందుకునే..
ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ సంస్థ ZOOM సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థ అధ్యక్ష బాధ్యతల నుంచి గ్రెగ్ టాంబ్ ను ఎలాంటి కారణం లేకుండా తొలగించింది. గ్రెగ్ తొలగింపు తర్వాత కూడా ZOOM అందుకు గల కారణాలను తెలపకపోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. రెగ్యులేటరీ ఫైలింగ్స్‌లో భాగంగా ఈ విషయాన్ని ZOOM ప్రభుత్వానికి తెలిపింది. కాగా.. ఆగస్టు 2019లో గ్రెగ్ జూమ్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. చీఫ్ రెవెన్యూ అధికారిగా జాయిన్ అయి తక్కువ కాలంలోనే ప్రొమోషన్ పొందాడు.
ఉద్యోగంలో చేరాక.. ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా పదవిని కోల్పోయాడు. జూమ్‌లో చేరక మునుపు గ్రెగ్ గూగుల్‌లో సేల్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. గత నెలలోనే ZOOM 1300 మందికి పైగా సిబ్బందిని తొలగించింది. ఆ సమయంలోనే జూమ్ సీఈఓ ఎరిక్ యువాన్ తన జీతంలోనూ 98 శాతం కోతతో పాటు, ప్రతి సంవత్సరం అందుకునే కార్పొరేట్ బోనస్ ను కూడా వదులుకున్నట్టు తెలిపారు. వరుసగా సాఫ్ట్ వేర్, ఐటీ కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తుండటంతో.. నిరుద్యోగ శాతం పెరుగుతోంది. ద్రవ్యోల్బణం ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో.. చిన్న ఉద్యోగాన్ని కూడా వదులుకోలేక తక్కువ జీతానికే చాలా మంది పనిచేస్తున్నారు.
Next Story