అఖిల విజయమ్మకు ఫోన్ చేసి...?
అఖిలప్రియ మనస్థాపం చెందారా? వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ టిక్కెట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి సరైన హామీ లభిచలేదా? అవును...ఇది నిజం. ముఖ్యమంత్రి చంద్రబాబు అళ్లగడ్డ పంచాయతీని రెండు రోజుల పాటు చేశారు. మంత్రి భూమా అఖిలప్రియ, భూమా నాగిరెడ్డి సన్నిహితుడు ఏవీ సుబ్బారెడ్టిల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి విభేదాల కారణంగా రెండు నియోజకవర్గాలు వచ్చే ఎన్నికల్లో దెబ్బతినే ప్రమాదముందని చంద్రబాబు గ్రహించారు. వీరి విభేదాలు ఇలాగే కొనసాగితే ఇటు ఆళ్లగడ్డ, అటు నంద్యాల నియోజకవర్గాలు వచ్చే ఎన్నికల్లో కోల్పోతామని భావించిన చంద్రబాబు ఇద్దరి మధ్య రాజీకుదిర్చే ప్రయత్నమైతే చేశారు.
టిక్కెట్ గ్యారంటీ లేకపోవడంతో.....
అయితే ఈ సందర్భంగా అఖిలప్రియకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ గ్యారంటీ ఇవ్వకపోవడం విశేషం. ఎన్నికలకు ముందు నిర్వహించిన సర్వేలో ఎవరికి గెలుపు అవకాశాలుంటాయని తేలితే వారికే టిక్కెట్ ఇస్తామని, అప్పటి వరకూ కలసి పని చేసుకువెళ్లాలని చంద్రబాబు సూచించినట్లు తెలుస్తోంది. చంద్రబాబు మాత్రం ఏవీ సుబ్బారెడ్డి వైపే మొగ్గు చూపుతున్నారన్నది టాక్. భూమా నాగిరెడ్డికి సన్నిహితుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డికి అటు ఆళ్లగడ్డలోనూ,ఇటు నంద్యాలలోనూ క్యాడర్ తో మంచి సంబంధాలున్నాయి. భూమా అనుచరుల్లో ఎక్కువమంది సుబ్బారెడ్డి వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో పంచాయతీలో ఈవిషయాన్ని చంద్రబాబు ఇద్దరికీ స్పష్టంగా చెప్పారు. సర్వేలో ఎవరికి అనుకూలంగా ఫలితాలొస్తే వారికే టిక్కెట్ ఇస్తామని చెప్పినట్లు సమాచారం.
హామీ ఇవ్వని విజయమ్మ.....
అయితే అఖిలప్రియకు విషయం అర్థం కావడంతో ఆమె ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తండ్రి భూమానాగిరెడ్డి, తల్లి శోభానాగిరెడ్డి మరణం తర్వాత తమ కుటుంబంపై కక్ష కట్టిన ఏవీ సుబ్బారెడ్డి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ తమక దక్కనివ్వరన్న ఆందోళనకూడా అఖిలప్రియలో ఉంది. అందుకోసం ఆమె వైసీపీలోకి తిరిగి వెళ్లాలన్న యోచన కూడా చేసినట్లు చెబుతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో భూమా ఫ్యామిలీకి మంచి సంబంధాలున్నాయి. భూమానాగిరెడ్డి పార్టీ వీడి వెళతారని జగన్ కూడా ఊహించలేదు. ఈ నేపథ్యంలో తిరిగి వైసీపీలో చేరేందుకు అఖిలప్రియ వైఎస్ విజయమ్మతో ఫోన్ లో మాట్లాడినట్లు సమాచారం. అయితే విజయమ్మ నుంచి ఎటువంటి హామీ లభించకపోయినా, తాను జగన్ తో మాట్లాడతానని మాత్రం చెప్పారని తెలుస్తోంది.
అందరితో విభేదాలు....
మరోవైపు అఖిలప్రియ మంత్రి పదవి చేపట్టిన తర్వాత జిల్లాలో ఎవరినీ లెక్క చేయకపోవడం కూడా మైనస్ గా మారింది. నంద్యాల నాన్న, ఆళ్లగడ్డ అమ్మలాగా చూసుకుంటున్నానని చెప్పిన అఖిలప్రియ జిల్లాకు చెందిన మంత్రి, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో కూడా సఖ్యతగా లేరన్న వార్తలు వస్తున్నాయి. అలాగే శాసనమండలి ఛైర్మన్న ఎన్ఎండీ ఫరూక్ సయితం అఖిల తీరును ఆక్షేపిస్తూ వస్తున్నారు. ఇక నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డిను కూడా అఖిలప్రియ పెద్దగా పట్టించుకోక పోవడంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ పై అనుమానాలు ఆమెలో కలుగుతున్నాయి. దీంతో ఆమె వైసీపీతో టచ్ లోకి వెళుతున్నారన్న టాక్ బలంగా విన్పిస్తోంది.టీడీపీ అధినేత చంద్రబాబుతో జరిగిన సమావేశంలో తలెత్తిన అనుమానాలే ఆమె విజయమ్మకు ఫోన్ చేయడానికి కారణాలుగా తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
- Tags
- allagadda
- andhrapradesh
- ap poliics
- av subbareddy
- bhooma akhila priya
- bhooma nagireddy
- kurnool
- nandyal
- nara chandrababu naidu
- telugudesam party
- ys jaganmohan reddy
- ysrcp
- ఆంధ్రప్రదేశ్
- ఆళ్లగడ్డ
- ఏపీ పాలిటిక్స్
- ఏవీ సుబ్బారెడ్డి
- కర్నూలు
- తెలుగుదేశం పార్టీ
- నంద్యాల
- నారా చంద్రబాబునాయుడు
- భూమా అఖిలప్రియ
- భూమా నాగిరెడ్డి
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి
- వైసీపీ