మరో రేవంత్ రెడ్డి....బైరెడ్డి.....?
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి... రాయలసీమలో కొంత పేరున్న నాయకుడు. ఆయన ఒక్కసారిగా మళ్లీ ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సభతో వార్తల్లోకి ఎక్కారు. రాహుల్ కర్నూలు సభకు అంత జనం ఎలా వచ్చారన్నది ఇప్పటికీ వైసీపీ నేతలకు అనుమానాలున్నాయి. రాహుల్ సభ కర్నూలులో సక్సెస్ కావడానికి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉన్నారన్నది జిల్లాలో విన్పిస్తున్న టాక్. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి కొంత మేరకు జన సమీకరణ చేసినా...బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి వల్లనే అంతమంది జనం పోగయ్యారన్నది పొలిటికల్ వర్గాల్లో విన్పిస్తున్న మాట. అయితే ఇంతకీ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నిజంగానే కాంగ్రెస్ లో ఉన్నారా? లోపాయి కారిగా తెలుగుదేశం పార్టీ మద్దతును పొందారా? అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
టీడీపీలో చేరతారనుకుంటే......
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తొలుత తెలుగుదేశం పార్టీలో చేరతారని అందరూ భావించారు. అయితే బైరెడ్డి రాకను కేఈ కుటుంబం వ్యతిరేకిస్తుందన్న వార్తలు అప్పట్లో విన్పించాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిక్కెట్ ను కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ కే చంద్రబాబు కేటాయించారు. అంతకు ముందు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అమరావతికి వెళ్లి మరీ చంద్రబాబునాయుడిని కలిసి వచ్చి మాట్లాడారు. ఆయన కర్నూలు పర్యటన సందర్భంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరతారనుకున్నారు. కాని అది జరగలేదు. బైరెడ్డి నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా పోటీ చేసిన తన అభ్యర్థి ఓటమి పాలవ్వడంతో తన పార్టీ రాయలసీమ పరిరక్షణ సమితిని రద్దు చేశారు.
కాంగ్రెస్ లో చేరడం వెనక...?
అయితే అనూహ్యంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనక కూడా టీడీపీ అధినేత చంద్రబాబు సూచనలు ఉన్నాయన్న గుసగుసలు ఆ పార్టీలోనే విన్పిస్తున్నాయి. రాయలసీమలోనూ ప్రధానంగా కర్నూలు జిల్లాలో జగన్ పార్టీని బలహీన పర్చేందుకు బైరెడ్డిని దగ్గరుండి చంద్రబాబు కాంగ్రెస్ లోకి పంపారని, ఈ ఎన్నికల్లో బైరెడ్డి గెలవకుంటే అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తానన్న హామీ బైరెడ్డి చంద్రబాబు నుంచి పొందినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజమెంతో? అబద్ధమెంతో తెలియదు కాని, రాహుల్ సభ సక్సెస్ అయిన తర్వాత ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయంటున్నారు.
కేఈ కుటుంబం నొచ్చుకోకూడదనే.....
రాహుల్ సభకు జనసమీకరణకు తెలుగుదేశం పార్టీ సహకరించిందన్న వ్యాఖ్యలు పొలిటికల్ క్యారిడార్ లో జోరుగా సాగుతున్నాయి. వివిధ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే రాహుల్ సభకు తరలి వచ్చారని, ఈ సభకు కావాల్సిన ఆర్థిక సాయాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి అందినట్లు గుసగుసలు విన్పిస్తున్నాయి. కె.ఈ కుటుంబం నొచ్చుకోకుండా బైరెడ్డిని చంద్రబాబు కావాలనే....తెలంగాణలో కాంగ్రెస్ లోకి రేవంత్ రెడ్డిని పంపినట్లుగానే పంపారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అలా కాంగ్రెస్ లో బలమైన నేతలను పంపి ఏపీలో జగన్ ను వీక్ చేయాలన్న ఉద్దేశ్యంతోనే బైరెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
- Tags
- andhra pradesh
- ap politics
- bireddy rajasekharreddy
- janasena party
- kurnool district
- nara chandrababu naidu
- pawan kalyan
- rahul sabha
- revanth reddy
- telugudesam party
- y.s. jaganmohan reddy
- y.s.rajasekharreddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కర్నూలు జిల్లా
- జనసేనపార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
- రాహుల్ సభ
- రేవంత్ రెడ్డి
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ