బాబుని మరీ లైట్ తీసుకుంటున్న జగన్ ?
చంద్రబాబు రాజకీయ అనుభవం అంత వయసు జగన్ ది. చంద్రబాబు రాజకీయాన్ని మొదలుపెట్టిందే వైఎస్సార్ తో కలసి. ఇద్దరూ 70వ దశకంలో మంచి మిత్రులుగా ఉండేవారంటారు. ఆ [more]
చంద్రబాబు రాజకీయ అనుభవం అంత వయసు జగన్ ది. చంద్రబాబు రాజకీయాన్ని మొదలుపెట్టిందే వైఎస్సార్ తో కలసి. ఇద్దరూ 70వ దశకంలో మంచి మిత్రులుగా ఉండేవారంటారు. ఆ [more]
చంద్రబాబు రాజకీయ అనుభవం అంత వయసు జగన్ ది. చంద్రబాబు రాజకీయాన్ని మొదలుపెట్టిందే వైఎస్సార్ తో కలసి. ఇద్దరూ 70వ దశకంలో మంచి మిత్రులుగా ఉండేవారంటారు. ఆ తరువాత చంద్రబాబు మామ ఎన్టీయార్ పెట్టిన పార్టీలోకి దూకేయడంతో విభేదాలు వచ్చాయి. అయితే అవి వ్యక్తిగత స్థాయిలోకి రావడంతో ఈ రెండు కుటుంబాలకు పడదు అన్న భావన రాజకీయ వర్గాల్లో ఏర్పడింది. వైఎస్సార్ వారసుడిగా జగన్ ని చంద్రబాబు అడుగడుగునా అడ్డుకున్నారు. అయితే జగన్ పంతం మీద తాను అనుకున్న సీఎం సీటు సాధించుకున్నారు.
మాటలతో ఆటేగా….?
చంద్రబాబుని అసెంబ్లీలో చూస్తే జగన్ అసలు ఊరుకోరు. అపోజిషన్ బెంచీలో చంద్రబాబు లేచి నిలబడి మాట్లాడుతూ సీరియస్ అవుతారు. దాన్ని ఆసరాగా చేసుకుని జగన్ కూడా రెచ్చిపోతారు. ఇది గత ఏడాదిన్నరగా సాగుతున్న విషయమే. నిజమే చంద్రబాబుకు పేలవమైన సంఖ్యా బలం అసెంబ్లీలో ఉంది. 23 మంది ఆ పార్టీ తరఫున గెలిస్తే అందుకో సగం మంది రావడమే కష్టంగా మారుతోంది. దాంతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోతున్నారు. ఇక బాబుకు మెదడు పనిచేయదు అంటూ ఘాటైన మాటలనే జగన్ వాడేస్తున్నారు.
వయసే ఆయుధం…..
చంద్రబాబుకు వయసు అయిపోయిందని ఆయన రాజకీయం కూడా అవుట్ డేటేడ్ అని జగన్ భావన. దాన్ని ఎక్కడా అసలు దాచుకోకుండా అసెంబ్లీ లోపలా బయటా కూడా అంటూనే ఉన్నారు. ఇక అదే వయసు తో జగన్ ని చులకనగా చూడడం చంద్రబాబు వంతు కూడా అవుతోంది. నా అనుభవం అంత లేదు జగన్ వయసు అన్నది చంద్రబాబు తేలికభావం. మొత్తానికి రెండవ ఏడు పూర్తి అవుతున్నా కూడా అసెంబ్లీలో ఈ ఇద్దరి రాజకీయ యుధ్ధం మాత్రం వయసు దగ్గరే ఆగిపోవడం విచిత్రమే, విషాదమే.
ఏమీ చేయలేరా…?
ఇక జగన్ ఆలోచనల బట్టి చూసినా, మాటలను తీసుకున్నా బాడీ లాంగ్వేజిని బట్టి చూసినా కూడా చంద్రబాబు తనకు అసలు పోటీ కారన్న ధీమాతోనే ఉన్నారనుకోవాలి. చంద్రబాబు రాజకీయం ముగిసిన అధ్యాయమని కూడా గట్టిగా నమ్ముతూ ఉండవచ్చు. కానీ రాజకీయాల్లో ఏదీ ఎండ్ కాదు, ఎన్నేళ్ళు అయినా కూడా పట్టుదల ఉంటే పోరాడుతూ ఉంటే జనాల్లో మళ్ళీ నిలిచి గెలిచిన వారు ఎందరో ఉన్నారు. జగన్ ఈ విషయంలో కాస్తా అతి విశ్వాసానికి పోతున్నారా అన్న కామెంట్స్ కూడా ఉన్నాయి. ఈ రోజు చంద్రబాబు అయినా అంతకు ముందు జగన్ అయినా ప్రతిపక్షంలో ఉన్నవారే. వారి వెనక ఉన్నది ఆ పది మంది ఎమ్మెల్యేలే బలం అనుకుంటే పొరపాటేనేమో. వెనక ఉన్న కోట్లాది ప్రజలే అసలైన న్యాయ నిర్ణేతలు. అందువల్ల రాజకీయాల్లో దేన్ని లైట్ తీసుకోకూడదు అంటారు. మరి వైసీపీ పెద్దలు దీన్ని గ్రహిస్తారా?