పాత కాంబినేషన్ కోసం బాబు… ?
రాజకీయాల్లో ఎప్పటికపుడు పరిస్థితులు మారిపోతూంటాయి. 2014 కి 2024కి మధ్య పదేళ్ల కాలం ఉంది. ఒక సెకన్ మారితేనే ఎన్నో రకాలుగా అర్ధాలు మారిపోతాయి. అలాంటిది 2014 [more]
రాజకీయాల్లో ఎప్పటికపుడు పరిస్థితులు మారిపోతూంటాయి. 2014 కి 2024కి మధ్య పదేళ్ల కాలం ఉంది. ఒక సెకన్ మారితేనే ఎన్నో రకాలుగా అర్ధాలు మారిపోతాయి. అలాంటిది 2014 [more]
రాజకీయాల్లో ఎప్పటికపుడు పరిస్థితులు మారిపోతూంటాయి. 2014 కి 2024కి మధ్య పదేళ్ల కాలం ఉంది. ఒక సెకన్ మారితేనే ఎన్నో రకాలుగా అర్ధాలు మారిపోతాయి. అలాంటిది 2014 ప్రయోగాన్నే రిపీట్ చేయాలని చంద్రబాబు ఆలోచన చేయడం అంటే నిజంగా నేల విడిచి సాము చేయడమే అంటున్నారు. తాజాగా చూస్తే మోడీ గ్లామర్ పాతాళానికి పడిపోతోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ని సినిమా హీరో గా మాత్రమే ఎక్కువ ఇష్టపడతామని జనాలు ఈ టైమ్ గ్యాప్ లో తేల్చేశారు. ఈ నేపధ్యంలో అటు బీజేపీ జనసేనలను చెరో వైపూ పెట్టుకుని రాజకీయ రంగంలో కత్తులు తిప్పడానికి చంద్రబాబు ఉత్సాహపడుతున్నారు.
ఈసారి ఇలా…?
ఇక మరో మూడేళ్లలో ఏపీలో కానీ దేశంలో కానీ జరిగే ఎన్నికలను ముందే అంచనా వేయడం కష్టమే కానీ ఇపుడున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే మాత్రం బీజేపీకి బొత్తిగా కాని కాలమే అవుతుంది అని చెప్పేయవచ్చు. ఏపీ వరకూ తీసుకుంటే అటు జగన్ ఉంటారు. ఆయనకు ఎవరితోనూ పొత్తులు లేవు. మరో వైపు బీజేపీని చంద్రబాబు దగ్గర తీస్తే వామపక్షాలు, కాంగ్రెస్ దూరం అవడం ఖాయం, అవి విడిగా పోటీ చేసినా ఏపీలో ట్రయాంగిల్ పోరు తప్పదు. ఆ నేపధ్యంలో ప్రతీ నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని విపక్షాలు చీల్చుకోవడం జరిగి తీరుతుంది. అది అధికార పక్షానికే ఉపయోగపడుతుంది అన్నది సందేహం లేని అంశమే.
రోత పుట్టదా …?
ఇక చంద్రబాబు మోడీ బీజేపీని వెంటబెట్టుని ఏపీలో తిరిగితే ఆ నెగిటివిటీ టీడీపీ మీద పడుతుంది అన్నది ఒక విశ్లేషణ. అలాగే పవన్ కళ్యాణ్ తో జత కట్టినా అంతకు ముందు ఎందుకు విడిపోయారో చెప్పుకోవాల్సిన అనివార్యత కూడా ఈ ఇద్దరి మీద ఉంటుంది. పైగా పవన్ నిలకడలేని రాజకీయాల ప్రభావం, చంద్రబాబు అవకాశ వాదాల పొత్తులు జనాలకు రోత పుట్టించే ప్రమాదం కూడా ఉంది అంటున్నారు. ఇక ఏపీలో జగన్ మీద ఒంటరిగా పోటీ చేయడానికి టీడీపీ ఇబ్బంది అయితే కమ్యూనిస్టులతో కాంగ్రెస్ తో కలసి వచ్చినా ఉన్నంతలో కొత్త అవుతుంది తప్ప బీజేపీని పవన్ని వెంటబెట్టుకుంటే అనుకూలత కంటే వ్యతిరేకతే ఎక్కువ అవుతుంది అన్న వాదనలు ఉన్నాయి.
వీరు కలుస్తారా …?
ఏపీలో జగన్ బీజేపీకి యాంటీగా ముందుకు వస్తే వామపక్షాలు ఆయనతో జట్టు కట్టడం కూడా జరుగుతుంది అన్న చర్చ కూడా ఉంది. ఈ విషయంలో సీపీఐ సంగతి ఎలా ఉన్నా సీపీఎం అయితే జగన్ తో సానుకూలంగానే ఉంటోంది. పైగా కేరళ సీఎం పినరయి విజయన్ యాంటీ మోడీ స్టాండ్ కి జగన్ మద్దతు ఇస్తున్న నేపధ్యంలో ఏపీలో కొత్త సమీకరణలు మొగ్గ తొడినా ఆశ్చర్యం లేదు. అలా కనుక చూసుకుంటే మోడీ వ్యతిరేకత వెల్లువలా వస్తే కనుక టీడీపీకి అది పెద్ద దెబ్బ అవుతుంది. అదే టైమ్ లో అధికారంలో ఉంటూ రెండవ మారు గెలుపు కావాలని జగన్ స్కెచ్ వేస్తే ఈ పరిణామాలే ప్లస్ అవుతాయని కూడా అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు రొడ్డకొట్టుడు పాలిటిక్స్ చేయడం ఇండైరెక్ట్ గా జగన్ నెత్తిన పాలు పోసినట్లే అన్న మాట అయితే వినిపిస్తోంది.