Tue Nov 05 2024 16:35:26 GMT+0000 (Coordinated Universal Time)
జీజే రెడ్డిని రామోజీరావు ఎలా మోసం చేశారంటే?
రామోజీరావుపై జీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో మార్గదర్శిపై కేసు నమోదయింది
కృష్ణా జిల్లా జొన్నపాడుకు చెందిన జీజే రెడ్డి ..జెకోస్లోవేకియాలో ఉన్నత విద్య పూర్తి చేశారు. ఢిల్లీ కేంద్రంగా నవభారత్ ఎంటర్ప్రైజెస్ కంపెనీలను స్థాపించారు. కృష్ణా జిల్లాకు చెందిన పెదపారుపూడి రామోజీ సొంత గ్రామం. కమ్యూనిస్ట్ నేత కొండపల్లి సీతారామయ్య ..రామోజీకి ఉద్యోగం ఇవ్వాలని జీజే రెడ్డికి సిఫార్సు చేశారు. దీంతో ఢిల్లీలోని తన కంపెనీలో రామోజీ రావుకు టైపిస్ట్ కమ్ స్టెనో ఉద్యోగం ఇప్పించారు జీజే రెడ్డి. అయితే... రామోజీ రావు తన బిజినెస్ స్కిల్స్ చూపించి.. తన తండ్రికి దగ్గరయ్యారని.. ఆ పై చిట్ ఫండ్ కంపెనీ కోసం రూ.5వేలు పెట్టుబడి కూడా పెట్టారన్నారు. రూ.5వేలు ప్రతిగా తన తండ్రి జీజే రెడ్డి పేరిట షేర్లు కూడా కేటాయించారని.. ఫిర్యాదులో జీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి పేర్కొన్నారు.
షేర్ల గురించి...
1985లో జీజే రెడ్డి మరణించే వరకు.. షేర్ల గురించి తమకు తెలియదన్నారు. 2014లో ఒక పత్రికలో వచ్చిన కథనం ఆధారంగానే..తనకు తన తండ్రి మార్గదర్శిలో ఎంత కీలకంగా వ్యవహరించారో తమకు తెలిసొచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటాల కోసం పలుమార్లు రామోజీని సంప్రదించామని, కానీ.. రామోజీ తమను కలవలేదని యూరి రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎట్టకేలకు 2016లో తనను కలిసేందుకు రామోజీరావు అపాయింట్మెంట్ ఇచ్చారని.. తన తండ్రి పేరు మీద ఉన్న షేర్లు.. బదలాయించాలని రామోజీని కోరినట్లు యూరి రెడ్డి తెలిపారు. కొంత కాలానికి బదిలీ చేస్తానని చెప్పారన్నారు. .తిరిగి అయన్ను కలిశాక.. నా పేరిట బదిలీ చేయడానికి..నా సోదరుడి నుంచి అఫిడవిట్ నో అబ్జక్షన్ సంతకం చేయమన్నారని, అయితే.. ఖాళీ అఫిడవిట్ కాగితాలు ఉండటంతో..తాము అభ్యంతరం వ్యక్తం చేసినట్లు యూరి రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇస్తామని చెప్పి...
ఆ సమయంలో రామోజీ కోపంతో ఊగిపోతూ తుపాకీతో బెదిరించి..బలవంతంగా సంతకాలు తీసుకున్నారని ఫిర్యాదులో యూరి రెడ్డి తాను ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ... ఆ కాగితాలు చెల్లవని, ప్రస్తుతం మార్గదర్శి మోసాలు వెలుగు చూస్తుండటం ఆ షేర్లు శైలజా కిరణ్ పేరు మీద బదలాయించడంతో దర్యాప్తు సంస్థను ఆశ్రయించడంతో ఫిర్యాదులో యూరి తెలిపారు. యూరి రెడ్డి ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేయగానే రామోజీ రావు ఎక్కడలేని తొందర చూపించారు. ఆఘమేఘాల మీద ఆయన లీగల్ టీమ్..హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిందని తెలిపారు. దీంతో సీఐడీ దీనిపై కేసు నమోదు చేసింది.
Next Story