కేఈ ఈ కుప్పిగంతులు ఆపవా?
కర్నూలు జిల్లాలో కేఈ కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. తొలి నుంచి కేఈ కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలకమైన పదవులను [more]
కర్నూలు జిల్లాలో కేఈ కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. తొలి నుంచి కేఈ కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలకమైన పదవులను [more]
కర్నూలు జిల్లాలో కేఈ కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. తొలి నుంచి కేఈ కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కీలకమైన పదవులను పొందారు. కానీ ఆయన సోదరుడు కేఈ ప్రభాకర్ మాత్రం తొలి నుంచి కుప్పిగంతులు వేస్తూనే ఉన్నారు. ఆయన కొన్ని రోజుల క్రితం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్థానికసంస్థల ఎన్నికల్లో తన అనుచరులకు టిక్కెట్లు ఇవ్వలేదన్న కారణంగా కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
టీడీపీకి రాజీనామా చేసి….
కేఈ ప్రభాకర్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన రాష్ట్ర రాజకీయ పరిణామాల దృష్ట్యా టీడీపీ నుంచి తప్పుకోవాలనుకున్నారు. వైసీపీలో చేరేందుకు ప్రయత్నించారు. అయితే వైసీపీ నేతలు సుముఖంగా లేరు. ఆయనను చేర్చుకోవడం వల్ల అదనపు ప్రయోజనం ఏదీ లేదని భావించిన వైసీపీ అధిష్టానం కేఈ ప్రభాకర్ కు కండువా కప్పేందుకు సిద్ధపడలేదు. దీంతో ఆయన కొంతకాలంగా అన్నింటికి దూరంగా ఉంటూ వస్తున్నారు.
వైసీీపీలో చేరాలనుకుని….
తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు కేఈ ప్రభాకర్ ను బుజ్జగించడంతో రాజీనామా పై వెనక్కు తగ్గారు. రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నా కేఈ కుటుంబం మాత్రం సైలెంట్ గానే ఉంటోంది. హైదరాబాద్ కే ఎక్కువగా కేఈ కృష్ణమూర్తి పరిమితమయ్యారు. అయితే తాజాగా కేఈ ప్రభాకర్ టీడీపీలో మరోసారి యాక్టివ్ అయినట్లు కన్పిస్తుంది. ఆయన ఈసారి తాను డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
పోటీపై ప్రకటన చేసి…..
ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కేఈ ప్రభాకర్ ఈ వ్యాఖ్యలు చేయడంతో పార్టీ అధిష్టానం సయితం విస్తుబోయింది. ఇప్పటికే కేఈ కృష్ణమూర్తి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన మరోసోదరుడు కేఈ ప్రతాప్ డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ వరస ఓటములను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కేఈ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు కుటుంబంలోనే చిచ్చు రగిలించా యంటున్నారు. డోన్ లో ఇప్పటికీ కేఈ ప్రతాప్ కు ప్రత్యేక వర్గం ఉంది. కేఈ ప్రభాకర్ కావాలనే ఈ వ్యాఖ్యలు చేశారా? లేక అన్యాపదేశంగా అన్నారా? అన్నది తెలియాల్సి ఉంది. మొత్తం మీద పెద్దాయన కేఈ కృష్ణ మూర్తి పరువును ప్రభాకర్ తీసివేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.