ఓటమి తెలిసినా పోటీకి దిగింది అందుకేనట
బద్వేలు ఉప ఎన్నికకు తెలుగుదేశం పార్టీ సిద్ధమయింది. ఉప ఎన్నికల్లో డాక్టర్ రాజశేఖర్ నే అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారు. అయితే రాజశేఖర్ చంద్రబాబు వద్ద షరతు [more]
బద్వేలు ఉప ఎన్నికకు తెలుగుదేశం పార్టీ సిద్ధమయింది. ఉప ఎన్నికల్లో డాక్టర్ రాజశేఖర్ నే అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారు. అయితే రాజశేఖర్ చంద్రబాబు వద్ద షరతు [more]
బద్వేలు ఉప ఎన్నికకు తెలుగుదేశం పార్టీ సిద్ధమయింది. ఉప ఎన్నికల్లో డాక్టర్ రాజశేఖర్ నే అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారు. అయితే రాజశేఖర్ చంద్రబాబు వద్ద షరతు పెట్టినట్లు తెలిసింది. 2023 ఎన్నికల్లోనూ తనకే టిక్కెట్ ఇవ్వాల్సి ఉంటుందని, అలా ప్రామిస్ చేస్తేనే తాను బరిలోకి దిగుతానని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇందుకు చంద్రబాబు సయితం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
తనకే వచ్చే ఎన్నికల్లోనూ…
2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాజశేఖర్ వైసీపీ అభ్యర్థి వెంకటసుబ్బయ్యపై ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి పెద్దగా పార్టీలో యాక్టివ్ గా లేరు. అయితే మరోసారి రాజశేఖర్ ను పోటీకి దింపాలని చంద్రబాబు నిర్ణయించారు. 2023 ఎన్నికల్లోనూ తనకే టిక్కెట్ ఇస్తానని హామీ ఇస్తేనే ఉప ఎన్నికల్లో బరిలోకి దిగుతానని రాజశేఖర్ స్పష్టం చేశారు. ఇందుకు గల కారణాలను కూడా ఆయన వివరించారని తెలిసింది.
సానుభూతి వస్తుందనేనా?
బద్వేలు శాసనసభ్యుడు వెంకటసుబ్బయ్య మృతితో ఉప ఎన్నిక అనివార్యమయింది. వెంకటసుబ్బయ్య కుటుంబ సభ్యులే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని జగన్ స్పష్టం చేశారు. వైసీపీ బలంగా ఉన్న బద్వేలు నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లోనూ ఓటమి తప్పదని రాజశేఖర్ కు తెలియంది కాదు. తాను పోటీ చేసినా మరోసా ఓటమి తప్పదని తెలిసినా ఆయన ఆశలన్నీ 2023 ఎన్నికలపైనే ఉన్నాయని తెలుస్తోంది.
ఆ షరతు పెట్టి మరీ….
2019 ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఓటమి పాలయితే తనకు సానుభూతి అధికంగా వస్తుందని రాజశేఖర్ భావిస్తున్నారు. ఉప ఎన్నికల్లో ఓటమి పాలయినా 2023 ఎన్నికల్లో ప్రజలు తనను ఆదరిస్తారన్న నమ్మకంతో రాజశేఖర్ ఉన్నారు. అందుకే చంద్రబాబు వద్ద ఈ షరతును రాజశేఖర్ పెట్టారంటున్నారు. చంద్రబాబు కూడా రాజశేఖర్ అభిప్రాయంతో ఏకీభవించడంతో ఆయననే అభ్యర్థిగా నిర్ణయించారు. మొత్తం మీద రాజశేఖర్ పై సానుభూతి సాధారణ ఎన్నికల్లో ఏ మేరకు పనిచేస్తుందన్నది వేచి చూడాల్సిందే.
‘