సేఫ్ ప్లేస్ వైసీపీయేనా?
కడప జిల్లా సీనియర్ నేత రామసుబ్బారెడ్డి ఇప్పుడు ఎటూ కాకుండా పోయారు. అటు టీడీపీలో ఇమడలేకపోతున్నారు. అటు వైసీపీలోకి వెళ్లాలని చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. [more]
కడప జిల్లా సీనియర్ నేత రామసుబ్బారెడ్డి ఇప్పుడు ఎటూ కాకుండా పోయారు. అటు టీడీపీలో ఇమడలేకపోతున్నారు. అటు వైసీపీలోకి వెళ్లాలని చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. [more]
కడప జిల్లా సీనియర్ నేత రామసుబ్బారెడ్డి ఇప్పుడు ఎటూ కాకుండా పోయారు. అటు టీడీపీలో ఇమడలేకపోతున్నారు. అటు వైసీపీలోకి వెళ్లాలని చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. రామసుబ్బారెడ్డి ఇప్పుడు తాను చేసిన పనికి మదనపడుతున్నారట. ఎన్నికల్లో తనకు ఆదినారాయణరెడ్డి వర్గం సహకరించలేదన్నది ఆయన ఆరోపణ. తన వద్ద నుంచి ఎమ్మెల్సీ పదవి తీసుకున్న ఆదినారాయణరెడ్డి కుటుంబం ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వలేదని ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నారట. అనవసరంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానంటూ ఆయన ఆవేదన చెందుతున్నారట.
సయోధ్య కుదిర్చినా….
కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయాల గురించి వేరే చెప్పనక్కరలేదు. అక్కడ రామసుబ్బారెడ్డికి, ఆదినారాయణరెడ్డి కుటుంబాల మధ్య దశాబ్దాల ఫ్యాక్షన్ తగాదాలున్నాయి. అయితే వైసీపీ నుంచి ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకోవడం రామసుబ్బారెడ్డి తొలుత అంగీకరించలేదు. మహానాడుకు కూడా అప్పట్లో హాజరుకాలేదు. మంత్రి పదవి కూడా ఇవ్వడంతో రగిలిపోయిన రామాసుబ్బారెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చి రామసుబ్బారెడ్డిని సంతృప్తి పర్చారు చంద్రబాబు. తర్వాత రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి ల మధ్య చంద్రబాబు సయోధ్య కుదిర్చారు.
ఎమ్మెల్సీ పదవి వదులుకుని….
2019 ఎన్నికల్లో జమ్మలమడుగు టిక్కెట్ రామసుబ్బారెడ్డికి ఇచ్చి ఆదినారాయణరెడ్డికి కడప ఎంపీగా పోటీ చేయించాలని నిర్ణయించారు. అయితే ఇందుకు ఆదినారాయణరెడ్డి తమ కుటుంబంలో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని, రామసుబ్బారెడ్డి చేత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించాలని షరతు పెట్టారు. దీనికి చంద్రబాబు కూడా అంగీకరించారు. మరోమూడేళ్లకు పైగా ఎమ్మెల్సీ పదవీకాలం రామసుబ్బారెడ్డికి ఉంది. అయినా సరే జమ్మలమడుగులో ఆదినారాయణరెడ్డి ఫ్యామిలీ సహకరిస్తే తన విజయం నల్లేరుపై నడక అవుతుందని భావించారు.
వైసీపీ వైపు చూపులు….
రామసుబ్బారెడ్డి రాజీనామా చేయడంతో ఆ పదవిని ఆదినారాయణరెడ్డి సోదరుడికి ఎమ్మెల్సీ పదవి చంద్రబాబు ఇచ్చారు. ఇక జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి ఓటమి తర్వాత ఆయన చూపంతా వైసీపీపైనే ఉంది. ఆదినారాయణరెడ్డి వైఎస్ జగన్ ను టార్గెట్ గా చేసుకుని మాట్లాడారు కాని రామసుబ్బారెడ్డి ఎప్పుడూ జగన్ ను విమర్శించలేదు. దీంతో ఆయన తనకున్న సన్నిహితుల ద్వారా వైసీపీలోకి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆదికి ఎటూ వైసీపీలో ఎంట్రన్స్ ఉండదు కాబట్టి తనకు వైసీపీయే సేఫ్ ప్లేస్ అని రామసుబ్బారెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. రామసుబ్బారెడ్డి పార్టీని వీడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.