జగన్ స్కూల్ స్టార్ట్ చేశారు..!!!
పవన్ కళ్యాణ్ పై నేరుగా యుద్ధానికి దిగిపోయారు వైసిపి చీఫ్ జగన్. తూర్పుగోదావరి జిల్లాలో జనసేన అధినేత వ్యక్తిగత జీవితంపై తొలిసారి సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్ ఆ తరువాత పవన్ పై నేరుగా ఎటాక్ చేయలేదు. నాటి వ్యాఖ్యలు విస్తృత స్థాయి చర్చకు దారితీశాయి. జగన్ తీరుపై విమర్శలు వెల్లువలా రాజకీయ పార్టీలు చేశాయి. మరోపక్క జనసేన శ్రేణులు తీవ్ర స్థాయిలో వైఎస్ కుటుంబం గురించి సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేశాయి టిడిపి సైతం పవన్ పై విమర్శలను తప్పుపట్టింది. ఆ తరువాత జగన్ తన పాదయాత్ర విశాఖ, విజయనగరం జిల్లాల్లో సాగిన పవన్ పై సాధారణ విమర్శలే చేస్తూ వచ్చారు. అయితే అకస్మాత్తుగా జగన్ జనసేన అధినేత ను చూసి చూడనట్లు వదిలేయకూడదని అటాకింగ్ మోడ్ లోకి మారిపోయారు.
అందుకే ఈ దూకుడు ...
తూర్పుగోదావరి, అనంతపురంల లో తన పర్యటనల్లో జనసేనాని విపక్ష నేతపై తీవ్ర స్థాయిలో దాడి చేస్తున్నారు. అధికార పార్టీ తో పాటు విపక్షాన్ని తిట్టి పోస్తున్నారు. జగన్ తీరు పై నిప్పులు చెరుగుతున్నారు. పవన్ చేసే ఈ వ్యాఖ్యలను ఉపేక్షిస్తూ పోతే మొదటికే మోసం వస్తుందని భావించే జగన్ నేరుగా పవన్ వ్యక్తిగత జీవితం పై అటాక్ చేశారని విలువలు లేని వ్యక్తి విలువలు నీతికోసం నిజాయితీ కోసం ఎలా మాట్లాడతారని స్కూల్ స్టార్ట్ చేశారు. రెండో భార్య ఉండగా మరో అమ్మాయికి కడుపు చేశారని సాక్షాత్తు రేణు దేశాయ్ వాపోతే ఆమెపై సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ దాడి చేశారని కనీసం దాన్ని నిరోధించని వ్యక్తి చేసింది మగతనామా అంటూ నిప్పులు చెరిగి ఎపి రాజకీయాలను మరోసారి హీటెక్కించారు.
టిడిపి ని క్లోజ్ చేసేందుకా ...?
ఎపి రాజకీయ క్రీడలో జగన్, పవన్ లు సాగిస్తున్న దూషణ పర్వం కారణంగా టిడిపి నామమాత్రపు రోల్ గా మారిపోయింది. ఒక పక్క తెలంగాణ ఎన్నికల వేడిలో టిడిపి అధినేత చంద్రబాబు తలమునకలై వున్నారు. దాంతో తెలుగుదేశం పార్టీ జోరు ఎపి లో మందగించింది. ప్రస్తుతం ఆట వైసిపి, జనసేన నడుమే సాగుతుంది. దాంతో అధికారపక్షం తన పాత్ర లేకుండా ఉండటంతో ఈ రెండు పార్టీల గోలే చర్చనీయాంశంగా మారింది. ఇది వ్యూహాత్మకంగా వైసిపి, జనసేన లు ఇలా సీన్ మారుస్తున్నాయా ? లేక తొలి రెండు స్థానాల్లో ఎపి పొలిటికల్ స్క్రీన్ పైకి ఎక్కేందుకు ప్రయత్నం చేస్తున్నాయో అన్న చర్చ హాట్ టాపిక్ గా మారింది