జగన్ కి ఆ ఫోబియా… ?
నాయకుడు అన్న తరువాత ఏ పరిస్థితులను అయినా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏ టైమ్ లోనూ బీరువు కారాదు. అపుడే అతని మీద జనాల ఫోకస్ కూడా పెరుగుతుంది. [more]
నాయకుడు అన్న తరువాత ఏ పరిస్థితులను అయినా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏ టైమ్ లోనూ బీరువు కారాదు. అపుడే అతని మీద జనాల ఫోకస్ కూడా పెరుగుతుంది. [more]
నాయకుడు అన్న తరువాత ఏ పరిస్థితులను అయినా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఏ టైమ్ లోనూ బీరువు కారాదు. అపుడే అతని మీద జనాల ఫోకస్ కూడా పెరుగుతుంది. అయితే అధికారం అనేది ఒక మత్తు. అదే సమయంలో అదొక కవచం. దానిని కప్పుకున్న వారు, ఆ మత్తులో ఉన్న వారు వేరే ప్రపంచాన్ని చూడడం అంటే అది అంత తేలికైన వైషయం కానే కాదు. దానికి ఎవరూ అతీతులు కూడా కారు. నాడు చంద్రబాబు అయినా నేడు జగన్ అయినా ఒకే రకమైన పరిస్థితులలో ఉన్నారనే అనుకోవాలి. ఒకసారి కుర్చీ ఎక్కగానే ఎంతటి వారికైనా దాన్ని దిగబుద్ధి వేయదు. దాంతో ఎవరి ఎక్కడ ఏ చిన్న సౌండ్ చేసినా కలవరమే చెలరేగుతుంది.
అది ముదిరితేనే..?
అభద్రతా భావం అన్నది రాజకీయ నాయకులకు ఎక్కువగా ఉంటుంది అని మానసిక శాస్త్రవేత్తలు కూడా చెబుతారు. మిగిలిన వారికి కూడా భయం ఉంటుంది కానీ పొలిటీషియన్స్ లో ఆ గ్రాఫ్ ఎక్కువగా ఉంటుంది. వారికి పక్కవాడు తుమ్మినా దగ్గినా కూడా భయం వేస్తుంది. ఇక ప్రతిపక్షం అంటే కూడా అదొక రకం జడుపు జ్వరంగానూ ఉంటుంది. లేకపోతే 151 సీట్లతో అప్రతిహత విజయం సాధించిన జగన్ ఎక్కడ. రాజకీయంగా ఈ రోజుకీ తండ్రి చాటు బిడ్డగానే చలామణీ అవుతున్న లోకేష్ ఎక్కడ. కానీ లోకేష్ టూర్ అనగానే ఎందుకు జగన్ అంతలా బెదురుతున్నారు అన్నదే వైసీపీ నేతలకు కూడా అర్ధం కావడంలేదుట.
అక్కడ లేదుగా..?
శత్రువు ఎక్కడో లేడు, మన మనసులోనే ఉన్నాడు అని రాజనీతి శాస్త్రం చెబుతుంది. అలా భయపడో, అతి జాగ్రత్తపడో ప్రత్యర్ధిని ఇంతింతై వటుడింతే అన్నట్లుగా పెంచి పెద్ద చేస్తారు. చివరికి వారి చేతులలోనే పరాభవం కోరి తెచ్చుకుంటారు. నాడు జగన్ ని ఒక ఎంపీ స్థాయిలో ఉండగానే చంద్రబాబు భయపడి అనవసరంగా కెలికి మరీ పెద్ద నేతను చేశారు. కాంగ్రెస్ అంతర్గత వ్యవహరంగా జగన్ కేసుని బాబు తీసుకుని ఉంటే జగన్ ఇంత పెద్ద లీడర్ అయ్యేవారు కాదు అన్న విశ్లేషణ కూడా ఉంది. ఇపుడు టీడీపీ విషయం అలాంటిదే. లోకేష్ కి టీడీపీలోనే పూర్తి మద్దతు దక్కడంలేదు. అలాంటి నేత టూర్లను బ్రేకులు వేస్తూ మహా నాయకుడిని చేసే ప్రయత్నాల వల్ల అంతిమంగా వైసీపీ కొంపే మునుగుతుంది అంటున్నారు.
కావాల్సింది అదే …?
ఎవరైనా రాజకీయ నాయకుడు ఫోకస్ కావాలనుకుంటారు. ప్రచారం చేసుకోవాలనుకుంటారు. ఆ పనిని అరెస్టుల ద్వారానో మరో రకంగానే అవతలి పక్షమే చేసేస్తూంటే వారికి ఎందుకు చింత. ఇపుడు లోకేష్ విషయంలోనూ తప్పుటడుగులు వైసీపీ గట్టిగానే వేస్తోంది. ఆయన నర్సారావుపేట వచ్చి పరామర్శ చేస్తే పోయేది ఏమీ లేదు. హైలెట్ కూడా అయ్యేది కాదు, కానీ ఆయనో ఒక మహా నాయకుడిగా మార్చేసి వేలాది మంది పోలీసులను పెట్టి మరీ నిర్భంచించడం ద్వారానే వందకు వేయి రెట్లు ఇమేజ్ ని తెచ్చిపెట్టారని అంటున్నారు. చంద్రబాబు వరకూ జగన్ ఇలాంటివి చేసినా ఓకే కానీ లోకేష్ విషయంలో మరీ హైరానా పడితే చివరికి కొత్త నేతగా యువ నాయకుడిని తెచ్చి మరీ ఎక్కించుకున్నట్లు అవుతుందని వైసీపీ హితైషులు అంటున్నారు. మొత్తానికి జగన్ లో మునుపెన్నడూ లేని అభద్రతాభావం పొడచూపుతోందా, ఆయనకూ ఈ ఫోబియా ఉందా అన్న డౌట్లు అందరికీ వచ్చేస్తున్నాయి. అదే కనుక నిజమైతే మాత్రం వైసీపీ జగనూ కూడా సాధారణ జాబితాలోనే మిగిలిపోతారు