పోలీస్ జీపు చిన్నమ్మ ఎందుకు ఎక్కలేదో తెలుసా?
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అసహనంతో ఊగిపోయారట. తాను చిల్లర దొంగను కాదని పోలీసులకు చెప్పారట. అక్రమాస్తుల కేసులో బెంగుళూరులోని పరప్పణ అగ్రహారం జైలుకు వెళ్లిన శశికళ అక్కడ పోలీసులపై చిందులు తొక్కారు. జైలులోకి ప్రయివేటు వాహనాలను, వ్యక్తిగత వాహనాలను అనుమతించరు. జైలు బయట నుంచి లోపలికి వెళ్లేందుకు దాదాపు ఒకటన్నర కిలోమీటర్ దూరం ఉంటుందట. దీంతో శశికళ గేటు వద్ద నుంచి జైలు లోపలికి తీసుకెళ్లడానికి పోలీసు వాహనాన్ని జైలు అధికారులు ఏర్పాటు చేశారు. అందులోకి ఎక్కమని శశికళను కోరారు. అయితే ఆ మాటతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయారట. తాను చిల్లరదొంగను కాదని పోలీసు జీపు ఎక్కడానికని చెప్పారట. ఎంతదూరం ఉన్నా తాను నడిచే వస్తానని అనడంతో జైలు అధికారులు కూడా ఏమీ చేయలేకపోయారట. చివరకు నడుచుకూంటూనే చిన్నమ్మ జైలు వద్దకు చేరుకున్నారు.
తెల్లచీరనూ వద్దన్నారు...
అలాగే రాత్రి భోజనం కూడా చేయలేదట. జైలు అధికారులు బలవంతపెట్టినా అన్నం ముట్టుకోలేదట. అయితే గురువారం మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో జైలు అధికారులు పెట్టిన భోజనాన్నే శశికళ తిన్నారు. అలాగే జైలు నిబంధనల ప్రకారం డ్రెస్ కోడ్ ఉంటుంది. తెల్ల చీర కట్టుకోవాలి. అందుకు కూడా చిన్నమ్మ తిరస్కరించారట. అయితే జైలు అధికారులు చాలా సీరియస్ గా చెప్పడంతో మంగళవారం తప్పనసరి పరిస్థితుల్లో తెల్ల చీరను కట్టుకున్నారట చిన్నమ్మ.