సోమిరెడ్డి వల్ల జగన్ కు ఎంత లాభమంటే?
ఆయన సీనియర్ పొలిటీషియన్.. కానీ, ప్రజలే గుర్తించలేదు. ఆయనకు చెప్పుకోదగ్గ పార్టీ అభిమానం ఉంది. కానీ, వెనకాల ప్రజలే లేరు. మరి రాజకీయ నాయకుడన్నాక.. జైకొట్టే జనాలు లేనప్పుడు ప్రయోజనమేమప్పా?! అంటున్నారు పార్టీలోని ఇతర నాయకులు! ఈ పరిస్థితి ఇప్పుడు నెల్లూరు కుచెందిన సీనియర్ రాజకీయ రెడ్డిగారు.. సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డికి ఎదురవుతున్న పరిస్థితి! ఆయన సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. కానీ, గెలుపు గుర్రం మాత్రం ఎక్కలేక పోతున్నారు. 2004, 2009, 2012లో కోవూరు ఉప ఎన్నికతో పాటు 2014 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు ఓడిన వ్యక్తిగా ఆయన నెల్లూరులోనే చరిత్ర సృష్టించారు. వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓడిన వ్యక్తికి చంద్రబాబు చాలా సాహసం చేసి మంత్రిని చేశారు. చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చారు.
పార్టీని బలోపేతం చేయాల్సి ఉన్నా.....
సరే.. గతంలో అంటే పార్టీ పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి.. ఆయన నెల్లూరులో పార్టీని ఏమీ చేయలేక పోయారు. కానీ, నేడు ప్రబుత్వంలో ఆయన కీలకమైన మంత్రి పదవిలో ఉన్నారు. దీంతో ఆయన జిల్లాలలో పార్టీని బలోపేతం చేసే అవకాశం ఉంది. అయినా కూడా ఆయన ఎక్కడా పార్టీని బలోపేతం చేసిందిలేదు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే జిల్లాలో టీడీపీకి మిగిలిన మూడు సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదు. నెల్లూరు ఎంపీ సీటు అంతే. కనీసం నాలుగు చోట్ల టీడీపీకి బలమైన అభ్యర్థులు లేని పరిస్థితి. కనీసం ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదు. మరి ఈ పరిస్థితిని మార్చాల్సిన మంత్రి సోమిరెడ్డి.. జిల్లాకు చేసింది ఏమైనా ఉందా? అంటే నీళ్లు నములుతున్న పరిస్థితి ఉంది. గ్రూపు రాజకీయాలకు తెరదీసిన ఆయన సాధించింది ఏమీ లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
సోమిరెడ్డి పై ఫైర్......
ఇప్పుడు ఇదే విషయాన్ని టీడీపీలో కీలకంగా ఉన్న ఆదాల ప్రభాకరరెడ్డి తెరమీదికి తెస్తున్నారు. ఆత్మకూరు మండలాల్లో పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్, ఆత్మకూరు తాత్కాలిక ఇన్చార్జ్ ఆదాల ప్రభాకరరెడ్డి సమావేశాలు నిర్వహించారు. దీనికి యథావిధిగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అనుచరుడు, పార్టీ నేత కన్నబాబు, అలాగే పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు సన్నిహితంగా ఉండే డీసీసీ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ్‌రెడ్డి గైర్హాజరయ్యారు. ఇక కొత్తగా రంగంలోకి రావాలనుకుంటున్న బొల్లినేని కృష్ణయ్య ప్రతినిధిగా అతని సమీప బంధువు తాళ్లూరి గిరినాయుడు హాజరయ్యారు. దీనిపై ఆదాల ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ మంత్రి సోమిరెడ్డి పేరు చెప్పకుండా ఆయనపై ఫైర్ అయ్యారు.
తనపై విషప్రచారం చేస్తున్నారని.....
గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తనని 2004 ఎన్నికల సమాయానికి పార్టీ నుంచి బయటకు పంపే శారని, మళ్లీ గత కొంతకాలంగా తనపై పార్టీలోని ఆయన సొంత మనుషుల ద్వారా విషప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు. వీళ్లకి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి.. వాళ్లకి మంత్రి పదవి రావాలే తప్ప జిల్లాలో పార్టీ బాగుం డాలని ఏమాత్రం లేదని, గోదావరి జిల్లాలో గెలిస్తే అధికారం వస్తుందనుకుంటున్నారని వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఈ వ్యాఖ్యలు నేరుగా సోమిరెడ్డిని టార్గెట్ చేసినట్టే కనపడుతోంది. గత ఎన్నికల్లో జిల్లాలో పార్టీకి నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా లేకుండా చేసిన పరిస్థితికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఆయన అకపోయినా ఇప్పుడు జిల్లాలో టీడీపీకి అదే దుస్థితి ఉంది. నిజానికి ఆదాల వ్యాఖ్యలతో అంతర్గత ఏకీభవిస్తున్న నాయకులు కూడా ఉండడం గమనా ర్హం. మొత్తం మీద సోమిరెడ్డి తీరుతో పార్టీకి నష్టం కలిగిస్తూ జగన్ కు పరోక్షంగా లాభం చేకూరుస్తుందన్నది పార్టీ వర్గాల అభిప్రాయం.
- Tags
- adala prabhakar reddy
- andhra pradesh
- ap politics
- bollineni krishnaiah
- janasena party
- kannababu
- mettukuri dhanujaya reddy
- nara chandrababu naidu
- pawan kalyan
- somireddy chandramohanreddy
- telugudesam party
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆదాల ప్రభాకర్ రెడ్డి
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కన్నబాబు
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- బొల్లినేని కృష్ణయ్య
- మెట్టుకూరి ధనుంజయ్ రెడ్డి
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి