Mon Dec 23 2024 06:07:48 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణలో బీజేపీ సీఎం ఫేస్ ఎవరు?
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ ను ఢీకొట్టడానికి
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి. బీఆర్ఎస్ ను ఢీకొట్టడానికి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు సిద్ధమవుతూ ఉన్నాయి. అయితే ఈ రెండు పార్టీలలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రావడం లేదు. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం తెలంగాణలో బీజేపీ సీఎం ఫేస్ ఎవరో త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతల్లో అంతర్గతంగా చర్చ సాగుతున్నట్లు సమాచారం. రాబోయే మూడు నెలల్లో ప్రజలను ఆకర్షించే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరై ఉంటారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. BRS అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఢీకొట్టగల, సమర్థవంతమైన అభ్యర్థి బీజేపీలో ఉన్నారా? అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి.
భారతీయ జనతా పార్టీ పలువురు బలమైన నాయకులు ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించి కీలక ప్రకటన రావాల్సి ఉంది. అలా చేస్తేనే ప్రజలలో కూడా పార్టీకి మైలేజ్ వస్తుంది. ఇక సెప్టెంబర్లో యాత్రలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ సెప్టెంబర్ 17 నుంచి బస్సు యాత్రలను చేపట్టనున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారు. అయితే బీజేపీ ముఖ్యమంత్రి ఫేస్ ఎవరో ఆగస్టు 27 నాటికి స్పష్టత వస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అమిత్ షా బహిరంగ సభకు హాజరుకావడం, రాష్ట్ర పార్టీ నేతలతో చర్చలు జరిపే అవకాశం వల్ల పార్టీ సీఎం ముఖంపై కీలక ప్రకటన రానుంది. పార్టీలో అంత మంది కీలక నేతలు ఉన్నా.. ఒక్క వ్యక్తికి సంబంధించిన నాయకత్వం గురించి కూడా బీజేపీలో చర్చ జరుగుతూ ఉంది. తాము అనుసరించాల్సిన నాయకుడు ఎవరు? అనే విషయం కూడా బీజేపీ కార్యకర్తల్లో ఒక క్లారిటీ రావాలని బీజేపీ నేతలు అంటున్నారు. ఓ వైపు లోక్ సభ ఎన్నికలలో మోదీని తిరిగి అధికారంలో కూర్చోపెట్టాలని బీజేపీ భావిస్తూ ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలని అనుకుంటూ ఉంది.
Next Story