Tue Dec 24 2024 20:02:14 GMT+0000 (Coordinated Universal Time)
ఇది స్కాముల ప్రభుత్వం : జేపీ నడ్డా తీవ్రవ్యాఖ్యలు
శ్రీకాళహస్తిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా ఏపీలో పర్యటిస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అధిష్టానం ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తోంది. తెలుగు రాష్ట్రాలపై కాషాయవర్గం కన్నేసింది. శనివారం ఉదయం రేణిగుంట చేరుకున్న ఆయన.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందించారు. తాజాగా శ్రీకాళహస్తిలో నిర్వహించిన బీజేపీ సర్వ అభియాన్ సభలో పాల్గొని.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన 9 ఏళ్ల మోదీ పాలనపై కీలక కామెంట్స్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధే అజెండాగా 9 ఏళ్ల పాలన కొనసాగిందని జేపీనడ్డా పేర్కొన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలను బాధ్యతాయుతమైన రాజకీయాలవైపు మళ్లించారన్నారు. దల పక్షపాతిగా ప్రధాని మోదీ సుపరిపాలన అందిస్తున్నారని చెప్పారు. ఎన్డీయే పాలనలో అన్నివర్గాల అభివృద్ధి జరుగుతోందన్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామన్నారు. దేశమంతా అభివృద్ధి జరగాలనే విధానం వైపు మోదీ మొగ్గు చూపారని పేర్కొన్నారు నడ్డా. పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, రైతుల సంక్షేమం కోసం కేంద్రం కృషి చేస్తోందన్నారు. ప్రధాని మోదీ ఏనాడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయలేదన్నారు.
మోదీ ప్రధాని అయ్యేనాటికి దేశంలో విద్యుత్ లేని గ్రామాలు 19 వేలు ఉండేవని, నేడు దేశంలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామమే కనిపించదన్నారు. 59 గ్రామాలకు మాత్రమే ఫైబర్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం ఉండేదన్న ఆయన.. ప్రతిచోటా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిందన్నారు. దేశంలో 50 కోట్ల మందికి రూ. 5 లక్షల చొప్పున బీమా సౌకర్యం కల్పించిన ఘనత మోదీ సర్కార్కు దక్కుతుందన్నారు. ప్రజల చికిత్స కోసం కేంద్రం రూ. 80 వేల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు
శ్రీకాళహస్తిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో అవినీతిలో కూరుకుపోయిందన్నారు. రాష్ట్రంలో జరిగేవన్నీ స్కాములేనని ఎద్దేవా చేశారు. అభివృద్ధి నిలిచిపోయి.. స్కాములే రాజ్యమేలుతున్నాయని అన్నారు. ల్యాండ్, లిక్కర్ స్కామ్లు నడుస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిగా అమరావతికి ప్రధాని మోదీ ఫాండేషన్ వేస్తే ఇక్కడ ఆ పనులేమీ జగరడంలేదన్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుందని పోలీసు వ్యవస్థ పనిచేయడం లేదని దుయ్యబట్టారు.
Next Story