బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయనున్న జగన్
ఎన్నికలకు వెళ్లడానికి ముందున్న ప్రభుత్వానికి నాలుగేళ్ల పాలన ఒక దిక్కైతే.. ఈ ఒక్క ఏడాది పాలన ఒక దిక్కు. ఎందుకంటే
ఎన్నికలకు వెళ్లడానికి ముందున్న ప్రభుత్వానికి నాలుగేళ్ల పాలన ఒక దిక్కైతే.. ఈ ఒక్క ఏడాది పాలన ఒక దిక్కు. ఎందుకంటే నాలుగేళ్ల నుంచి రాష్ట్రాన్ని పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా ఈ ఒక్క ఏడాది అభివృద్ధి చేస్తే మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే నాలుగేళ్ల పాలన తర్వాత పలు వర్గాల్లో ఇప్పటికీ ప్రభుత్వ వ్యతిరేకత ఉండటంతో.. వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రభుత్వం.. అసంతృప్తిగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, కౌలు రైతులు, గ్రామ సర్పంచ్లు, స్థానిక ప్రభుత్వాల ప్రజాప్రతినిధులు, మద్యం ప్రియులు, అర్బన్ పట్టణాల్లోని యువతకు మేలు చేసే విధంగా పలు కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైందని వైసీపీ వర్గాలు అంటున్నాయి.
నాలుగేళ్ల సుదీర్ఘ పాలన కాలంలో కొన్ని అసంతృప్తులు, వ్యతిరేకతలకు పలు కారణాలు ఉన్నా.. వారందరినీ ఒక్కసారిగా ఆకట్టుకోవడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయబోతున్నారు. ఇప్పటి వరకు గ్రామీణ పేదలు, రైతు కుటుంబాలు, మహిళలకు ప్రభుత్వం అమలు చేస్తోన్న నగదు బదిలీ పథకాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను.. ప్రతి కుటుంబం వద్దకు వైసీపీ తీసుకెళ్తూ వస్తోంది. గత ప్రభుత్వం ఇంత సంక్షేమం, అభివృద్ధిని ఇచ్చిందా?అని పోల్చి మరీ అడుగుతున్నారు. ఇలా వైసీపీ పట్ల సానుకూలత పెంచుతూ, ప్రజలను తన వైపు తిప్పుకునేలా చేసుకుంటోంది వైసీపీ.
ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ తన బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసిన తర్వాత.. ఈ నాలుగేళ్లలో పలు వర్గాల్లో ఉన్న అసంతృప్తులను, వ్యతిరేక అభిప్రాయాలను చిటికెలో మర్చిపోయేలా చేయగలరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకసారి ఈ వ్యతిరేకత తొలగిపోయాక.. మిగిలిన సమాజానికి జగన్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు అన్నీ కూడా వారికి పాజిటివ్ కోణంలోనే కనిపిస్తాయి. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకతను ఒడిసి పట్టుకోవడంలో టీడీపీ వైఫల్యం కనిపిస్తుంది. ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్న వర్గాలను ఓట్ల రూపంలో మల్చుకునేలా టీడీపీ ఎలాంటి వ్యూహాలు రచించడం లేదని టాక్. ఇదే వైసీపీకి ఏనుగంత బలాన్ని చేకూర్చుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.