మణిపూర్ ఘటనపై జగన్, చంద్రబాబు, పవన్ మౌనం.. కారణం అదేనా?
మణిపూర్లో అత్యంత అవమానకరమైన సంఘటన ఒకటి జరిగింది. సంఘవిద్రోహుల సమూహం ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిం
మణిపూర్లో అత్యంత అవమానకరమైన సంఘటన ఒకటి జరిగింది. సంఘవిద్రోహుల సమూహం ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి, వారిలో ఒకరిపై అత్యాచారం చేసింది. బాధితురాలి సోదరుడిని కూడా దుష్ట గుంపు హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన మే నెలలో జరిగినప్పటికీ వీడియో వైరల్ కావడంతో నిన్న వెలుగులోకి వచ్చింది. మణిపూర్లో ఇంటర్నెట్ పునరుద్ధరణ తర్వాత వీడియో బయటకు వచ్చింది. ఈ ఘటన అత్యంత సున్నితమైనది, అసహ్యకరమైనది, భయానకమైనది కూడా. ఈ ఘటనతో అంతర్జాతీయ మీడియా మరోసారి భారతదేశాన్ని ప్రతికూల కోణంలో చిత్రీకరించింది. ప్రతి భారతీయుడిని సిగ్గుపడేలా చేసింది. దీనిపై సోషల్ మీడియాలో పలువురు స్పందిస్తూ.. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
మణిపూర్ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కొందరు మాటలతో దాడి చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్కల్యాణ్లు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా గానీ, మీడియాతో కానీ స్పందించకపోవడం విస్తుగొలిపే అంశం. కేంద్రంలో బీజేపీతో అప్రకటిత పొత్తు ఉన్నందున వైఎస్ జగన్ మౌనంగా ఉన్నారా? అని ప్రశ్న వస్తోంది. ఈ విషయంపై వ్యాఖ్యానించడం బీజేపీ ఆగ్రహానికి గురి చేస్తుందనే భయంతో పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారా? పొత్తు కోసం బిజెపి నుండి సానుకూల స్పందన కోసం వేచి ఉన్న చంద్రబాబు.. అందుకే ఈ ఘటనపై మౌనంగా ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఖండిస్తూ ప్రకటన కూడా చేయలేనంత రాజకీయ పరంగా మన రాష్ట్రానికి చెందిన పార్టీ పెద్దలు లెక్కలు వేసుకుంటే, వారిని నాయకులు అని ఎలా అంటారు? అని ప్రజలు అనుకుంటున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీ చేతిలో కీలు బొమ్మలా మారాయని ప్రజలు మండిపడుతున్నారు. ఇంతటి దారుణ ఘటన జరిగినా.. కేవలం బీజేపీ మెప్పు కోసం ఎలాంటి ఈ పార్టీలు స్పందించడం లేదని తెలుస్తోంది.