Sun Dec 22 2024 23:30:13 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ
దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ ప్రధానితో భేటీ కానుండటంతో ఆసక్తికరంగా మారింది. ఏపీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను..
భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేడు విశాఖ పర్యటనకై ఆంధ్రప్రదేశ్ కు రానున్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయనతో భేటీ కానున్నారు. ఈరోజు రాత్రి 8.30 గంటలకు ఐఎన్ఎస్ చోళలో ప్రధానితో పవన్ భేటీ కానున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత పవన్ కల్యాణ్ ప్రధానితో భేటీ కానుండటంతో ఆసక్తికరంగా మారింది. ఏపీలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను పవన్ ప్రధానికి వివరించనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి భేటీతో ఏపీ రాజకీయ ముఖచిత్రం మారబోతుందా ? ఈ భేటీలో పవన్ ప్రధానితో ఏయే అంశాలపై చర్చించనున్నారోనని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.
కాగా.. ఇటీవల పవన్ కల్యాణ్ బీజేపీ జాతీయ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రోడ్ మ్యాప్ అడిగినా ఇవ్వడం లేదని బహిరంగంగానే ప్రకటించారు. మోదీ అంటే తనకు ఇష్టం కానీ.. బానిసల్లా ఉండాలి అంటే కుదరదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆ వ్యాఖ్యలతో పవన్ కల్యాణ్ బీజేపీకి బైబై చెప్పి.. మళ్లీ టీడీపీతో జతకడతారన్న వార్తలు తెరపైకి వచ్చారు.
Next Story