Mon Dec 23 2024 10:38:45 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ లోకి జూపల్లి, పొంగులేటి : బీజేపీ పై ఒత్తిడి
జూన్ 20 లేదా 25 తేదీల్లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బహిరంగసభకు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ
బీఆర్ఎస్ బహిష్కృత నేతలు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి హస్తం గూటికి చేరనున్నారు. కాంగ్రెస్ లో వీరి చేరిక లాంఛనమైంది. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు బహిరంగ సభ ఖమ్మంలో భారీగా ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 20 లేదా 25 తేదీల్లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బహిరంగసభకు రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ వాద్రా రానున్నట్లు సమాచారం. అదే రోజున జూపల్లి, పొంగులేటి తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కాంగ్రెస్ లో వీరిద్దరి చేరిక ఖాయమైంది.
అలాగే వారిద్దరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అధిష్టానాన్ని కోరగా.. ఆ ప్రయత్నాలు కూడా ఫలించినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో పొంగులేటి, జూపల్లి లకు టికెట్లకు ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. అయితే.. వారిద్దరితో పాటు మరికొందరిని కూడా కాంగ్రెస్ లో చేర్చాలని చెప్పినట్లు తెలిసింది. దాంతో జూపల్లి, పొంగులేటి తెలంగాణ బీజేపీ నేతలపై ఒత్తిడి చేస్తున్నారట. ఎంతమంది నేతలు జూపల్లి, పొంగులేటి లతో కలిసి కాంగ్రెస్ లో చేరతారో చూడాలి.
Next Story