ఛాన్సే లేదు.. ఇకనైనా డ్రామాలు ఆపు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి. తాజాగా ఈ వ్యవహారంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడారు. ఈ కేసులో వైఎస్ అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్ వచ్చే అవకాశాలే లేవన్నారు. ఆయన ఇకనైనా నాటకాలు ఆపితే బాగుంటుందన్నారు. అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగాలని ఆయన కోరారు. ఢిల్లీలో గురువారం నాడు మీడియాతో మాట్లాడిన రఘురామ.. అవినాష్‌రెడ్డి తల్లి హెల్త్ కండీషన్ బాగానే ఉందని చెప్పిన సీఐని తమ పార్టీ నాయకులు కొందరు కొట్టినట్లు తనకు తెలిసిందన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.. ఆ సీఐ దూషించినట్లు తెలిసిందన్నారు. అవినాష్ రెడ్డి తల్లి హెల్త్ బాగుందని చెప్పిన డాక్టర్లకు ప్రొటెక్షన్ కల్పించాల్సిన అవసరం కనబడుతోందన్నారు.
విశాఖపట్నంలో సీఎం జగన్ స్వీయ పట్టాభిషేకం చేసుకున్నారని, ఇప్పుడు అమరావతిలో తనది కానీ భూముల్లో పేదలకు పట్టాభిషేక చేస్తాననడం కామెడీగా ఉందన్నారు. ప్రజాస్వామ్య దేశానికి పార్లమెంటు దేవస్థామని సీఎం జగన్ అన్నారని, అలా అయితే పార్లమెంటు సభ్యులు దేవుళ్లే కదా అని రఘురామ అన్నారు. ఒక పార్లమెంటు సభ్యుడినైన తనను గొడ్డును బాదినట్లు బాదించారని చెప్పారు. ప్రజాస్వామ్యానికి పార్లమెంటు దేవస్థానం అని సీఎం జగన్‌కు ఇప్పుడు గుర్తొచ్చిందా? అంటూ రఘురామ ప్రశ్నించారు.
రాజధాని అమరావతి కోసం ఆందోళన చేస్తున్న వారికి సపోర్ట్ చేసినందుకు జడ శ్రావణ్‌కుమార్‌ను అరెస్ట్ చేయడం దారుమన్నారు. మూడు రాజధానులకు అనుకూలంగా ఆందోళనలు చేస్తున్న వారికి పర్మిషన్ ఇవ్వడంపై ఫైర్ అయ్యారు. ఇదిలా ఉంటే నిన్న.. అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యంపై ఎంపీ రఘురామ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డి తల్లి గారు అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారని చెబుతుంటే ఏపీ ప్రజలు ఎవరు నమ్మడం లేదని, ఆమె ఆరోగ్యంతోనే ఉన్నారని అయినా అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరినట్లుగా డ్రామాలాడుతున్నారని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.