Thu Dec 19 2024 15:19:39 GMT+0000 (Coordinated Universal Time)
Nagababu : ఎందుకంత తొందర సామీ.. నోరు.. చేయి కుదురుగా లేకపోతే ఇలాగే ఉంటది మరి
మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబుకు తొందర ఎక్కువ. అనేక సార్లు వివాదంలో చిక్కుకున్నారు
మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబుకు తొందర ఎక్కువ. ఎవరిపైనా సరే పూనకంలా ఊగిపోతాడు. ముగ్గురి అన్నదమ్ముల్లో కొంత ఫైర్ ఎక్కువగా అని నాగబాబుకు పేరు. గోటితో పోయేదానిని గొడ్డలితో తెచ్చుకోవడం అంటే నాగబాబు ఇష్టపడినంతగా మెగా ఫ్యామిలీలో మరెవరూ ఇష్టపడరేమో. మెగా ఫ్యామిలీ మీద ఎవరైనా విమర్శలు చేస్తే చాలు విరుచుకుపడటానికి రెడీ అయిపోతారు. పర్యావసనాలు ఆలోచించరు. తన మనసు మెత్తన అంటూనే ఘాటు గా కామెంట్స్ చేయడం నాగబాబుకు వెన్నతో పెట్టిన విద్య.
అనేక సార్లు వివాదంలో...
ఇప్పటికి అనేక సార్లు నాగబాబు ట్వీట్లు చేసి వివాదంలో చిక్కుకున్నారు. పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు పొగడ్తలు ఎంత సహజమో.. విమర్శలు కూడా అంతే నిజం. కానీ చిరంజీవి తన పైన వచ్చే విమర్శలను కూడా ఆయన పట్టించుకోరు. చూసీ చూడనట్లు వదిలేస్తారు. అందుకే ఆయన ఎప్పుడూ కాంట్రవర్సీని కొని తెచ్చుకోలేదు.కానీ నాగబాబు ఇందుకు వ్యతిరేకంగా... దారిని పోయే కంపను నెత్తికిచుట్టుకున్నట్లు ఉంటుంది ఆయన వ్యవహారం. తొందరపడటం.. తర్వాత సర్దుకోవడం ఆయనకు మామాలే.
అల్లు అర్జున్ పై...
మరోసారి నాగబాబు ట్విట్టర్ లో అల్లు అర్జున్ పై పరోక్షంగా పెట్టిన పోస్టును డిలీట్ చేశారు. తన పోస్టును డిలీట్ చేస్తున్నట్లు చెప్పారు. "మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే" అని నాగబాబు చేసిన ట్వీట్ దుమారం రేపింది. మెగా కాంపౌండ్ లోనూ కలకలరం రేగింది. మెగా ఫ్యామిలీలో విభేదాలున్నాయని ఆయన తనకు తానే బయట పెట్టుకున్నారంటూ అనేక మంది వ్యాఖ్యానాలు కూడాచేశారు. ఇందుకు కారణం తన స్నేహితుడైన నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ వెళ్లడంతో ఆయన ఆవేశం ఆపుకోలేక ఆ ట్వీట్ చేశారు. తర్వాత బూమరాంగ్ అవ్వడంతో దానిని డిలీట్ చేశారు. మరి ఎందుకంత తొందర? ఎందుకంత ఆవేశం? అన్న ప్రశ్నకు మాత్రం సమాధనం దొరకదు.
Next Story