Sun Dec 22 2024 23:39:12 GMT+0000 (Coordinated Universal Time)
అంబటి వర్సెస్ అయ్యన్న.. ముదురుతోన్న ట్విట్టర్ వివాదం
అయ్యన్న పాత్రుడు ఓ ట్వీట్ లో సార్ మీ ఇంటర్వ్యూ కావాలి అంటూ కాంబాబుకి వాట్సాప్ లో ఓ యూట్యూబ్ ఛానల్
ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే..! మంత్రి అంబటి రాంబాబు సంస్కార హీనుడు అంటూ అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు. తెల్లచొక్కా వేసి కళ్లజోడు పెట్టినంత మాత్రాన కామాంధులు సంస్కారవంతులు కాలేరని, హైదరాబాద్లోని ఓ టీవీ ఛానల్ వెనక రాసలీలల గెస్ట్ హౌస్ నుంచి.. విజయవాడ హనీ గెస్ట్హౌస్ వరకూ అంబటి కామచరిత్ర బయటకు వస్తోందని అయ్యన్న ఆరోపించారు. ఇంకా ఉడత ఊపులు ఎందుకు కామబాబు?.. ఒక యాంకర్ అని నేను మెసేజ్ పెడితే అంబటి, అతని మనుషులు.. ఆరుగురికి ఫోన్లు చేసి తప్పైందని, మెసేజ్లు డిలీట్ చేయాలని కోరారని అయ్యన్న అన్నారు.
అయ్యన్న పాత్రుడు ఓ ట్వీట్ లో సార్ మీ ఇంటర్వ్యూ కావాలి అంటూ కాంబాబుకి వాట్సాప్ లో ఓ యూట్యూబ్ ఛానల్ యాంకర్ మెసేజ్ చేసిందని.. ఇంటర్వ్యూ ఇస్తా నాకేం ఇస్తావ్ అంటూ కాంబాబు రిప్లై ఇచ్చాడని, త్వరలో ఆ వివరాలు ప్రపంచానికి తెలియజేస్తానంటూ ట్వీట్ చేశారు. "ఆడదైతే చాలు సొంత కూతురుని కూడా వంకర చూపులు, వంకర మాటలు మాట్లాడే రకం ఆయన అంటూ..? త్వరలోనే యుట్యూబ్ యాంకర్ సీఎంను కలబోతుంది.. ఇక మీ చీటీ చినిగినట్టే" అంటూ మరో ట్వీట్ చేశారు. ఇలా వరుస ట్వీట్లను చేశారు అయ్యన్న.
టీడీపీ ఆరోపణలపై మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. "నన్ను అంటారు.. తిరిగి అంటే... టీడీపీతో పాటు ఈనాడు, టీవీ 5, ఆంధ్రజ్యోతి కలసికట్టుగా నా మీద పడి ఏడుస్తారు. ఎంత ఏడ్చినా.. ఎంత మొరొగినా... తగ్గేదేలే!!" అంటూ అంబటి రాంబాబు ప్రతిస్పందించారు.
"బట్టబయలు చేస్తాను.. బద్దలుకొడతాను.. బర్తరఫ్ చేయిస్తానని ట్విట్టర్ లోనే మొరుగుతూ సైడ్ అయిపోయిన సన్నాసి ఎవడు ?" అని ఒక ట్వీట్ లో.. "చిన్ని గోపాలుడి బెడ్ రూమ్ లో తుపాకులు పేలడానికి ఎవరి రాసలీలలు కారణం?" అంటూ మరో ట్వీట్ లో పోస్టులు పెట్టారు. "పాఠాలు చెప్పడానికి వచ్చిన టీచర్ తో పని చేయడానికి వచ్చిన పనిమనిషితో రాసలీలలు నడిపిన పప్పు ఎవరు?" అంటూ ఇంకొక ట్వీట్ చేశారు అంబటి.
"విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని
ధర్మపోరాటంలో లాక్కోలేక
పక్కలేసి జయప్రదంగా
లాగేసుకున్న నక్క ఎవరు ?"
"బుట్టదాఖలైన బట్టతల బడుద్ధాయి బట్టబయలు చేస్తాను,బర్తరఫ్ చేయిస్తాను అని ప్రగల్బాలు పలికి
సైడ్ అయిపోయిన సన్నాసి ఎవడు ?
@AyyannaPatruduC" అంటూ అంబటి రాంబాబు ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు.
Next Story