Mon Dec 23 2024 17:16:10 GMT+0000 (Coordinated Universal Time)
కేటీఆర్ వ్యాఖ్యల దుమారం.. అర్ధరాత్రి ఆసక్తికర ట్వీట్
బెంగళూరులో ఉన్న కొన్ని కంపెనీలు కూడా ఏపీలోని అధ్వాన్నపు రోడ్ల గురించి మాట్లాడుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే..
హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో ను ఆయన ప్రారంభించారు. అక్కడ మాట్లాడుతూ ఏపీలో తీవ్ర విద్యుత్ కొరత ఉందన్నారు. అక్కడ కరెంట్ లేదు, నీళ్లు లేవని విమర్శించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని రోడ్లన్నీ అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. ఈ విషయాలన్నీ ఏపీలో సొంతూళ్లకు వెళ్లొచ్చిన తన మిత్రులు చెప్పారని, ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్లు ఉంటుందన్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
బెంగళూరులో ఉన్న కొన్ని కంపెనీలు కూడా ఏపీలోని అధ్వాన్నపు రోడ్ల గురించి మాట్లాడుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ చాలా అభివృద్ధి చెందిందన్నట్లు కేటీఆర్ చెప్పుకొచ్చారు. తాను చెప్పేదేమి అతిశయోక్తి కాదన్న మంత్రి కేటీఆర్.. కావాలంటే ఏపీకి వెళ్లి అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడాలని సూచించారు. ఏపీకి వెళ్లి తిరిగి తెలంగాణకు వచ్చాక చాలా ప్రశాంతంగా ఉందని తన మిత్రులు తెలిపినట్లుగా మంత్రి చెప్పారు.
ఈ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. అయితే వీటిపై కేటీఆర్ స్పందించారు. ఈ మేరకు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. క్రెడాయ్ సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలు ఏపీలోని తన స్నేహితులకు తెలియకుండానే కొంత బాధ కలిగించి ఉండొచ్చని.. ఈ వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశం లేదని.. ఎవరినో బాధపెట్టాలనో.. కించపరచాలనో అలా మాట్లాడలేదన్నారు. ఏపీ సీఎం జగన్ను సోదర సమానుడిగా భావిస్తున్నానని.. జగన్ నాయకత్వంలో ఏపీ అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నట్లు ట్వీట్లో తెలిపారు.
Next Story