పవన్ దళపతి కాదు.. దళారీ: మంత్రి రోజా
ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పర్యాటక శాఖ మంత్రి ఆర్కే
ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చంద్రబాబు కోసం పవన్ ఢిల్లీలో ఏజెంట్‌గా మారారని తీవ్రంగా మండిపడ్డారు. పవన్ పార్టీ పెట్టి 9 సంవత్సరాలు అవుతోంది.. పవన్ కళ్యాణ్ అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. పొత్తు పెట్టుకోవడానికి పార్టీలు లేక మళ్లీ బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పటం సిగ్గుచేటని, గతంలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకొనని ఇప్పుడేమో బీజేపీ, టీడీపీలతో పొత్తుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని మంత్రి రోజా అన్నారు.
పవన్ కళ్యాణ్ ప్యాకేజి కోసం పని చేస్తున్నాడు కానీ ప్రజల కోసం కాదన్నారు. మూడు పార్టీలు కలిసి పోటీచేస్తాయని పవన్ చెప్పడం విడ్డురంగా ఉందన్నారు. చంద్రబాబుకి ఎన్డీయే నుంచి పిలుపు రాలేదు. బాబు దిగజారుడు రాజకీయాలు తెలుసు కాబట్టే ఎన్డీయే నుంచి ఆహ్వానం రాలేదన్నారు. చంద్రబాబు ఊసరవెల్లి లాంటోడని అందుకే ఎన్డీయే పక్కన పెట్టిందన్నారు. బాబు ఎన్ని లేఖలు రాసిన కూడా ఎన్డీయే పట్టించుకోదన్నారు. తన తల్లిని తిట్టించ్చిన వాళ్ల కోసం పవన్ దళారీగా మారాడని మంత్రి రోజా అన్నారు.
పవన్ కళ్యాణ్ దళపతి కాదు దళారీ అని రోజా ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేకే దిక్కు లేదు.. పవన్ సీఎం ఎలా అవుతారని రోజా వ్యాఖ్యానించారు. కాపులకు, నమ్ముకున్న కార్యకర్తలకు పవన్ క్షమాపణలు చెప్పాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో కానీ రాజకీయాల్లో జీరో అని ఎద్దేవా చేసారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గర్వంగా చెప్పుకునేలా పాలన అందిస్తూ , ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని , ప్రతి గ్రామానికి అభివృద్ధిని అందిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని రోజా అన్నారు.