Mon Dec 23 2024 05:49:13 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కీలక ప్రకటన చేయనున్న పవన్ ?
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించడానికి నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.
కర్నూల్ : అందరం కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుదాం అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుపై ఇవాళ జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందిస్తారనే ఊగాహానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించడానికి నేడు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అనంతరం సిరువెళ్లలో జరగనున్న బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తారు. ఆయన ప్రసంగంపై ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీంతో టీడీపీతో పొత్తుకు పవన్ సిద్ధమవుతున్నారనే ప్రచారం మొదలయ్యింది.
ఇవాళ పవన్ కళ్యాణ్ ఈ అంశంపైన మరింత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉండొచ్చు. పొత్తులపై ఆయన ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని జనసేన వర్గాలు కూడా భావిస్తున్నాయి. అందరం కలిసి పోరాడాలని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించిన జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్.. పొత్తులపై తమ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడతారని తాజాగా చెప్పారు. ఈ నేపథ్యంలో ఇవాళ పవన్ ప్రసంగంపై అందరి ఆసక్తి నెలకొని ఉంది.
Next Story