Fri Dec 20 2024 01:49:08 GMT+0000 (Coordinated Universal Time)
వారాహితో యాత్ర.. రూట్ మ్యాప్ సిద్ధం
పవన్ కల్యాణ్ వారాహి వాహనంతో ప్రచారం చేయడంపై నేడు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్..
జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి వాహనంతో జనాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైంది. వారాహి, వారాహిలో వచ్చే పవన్ కోసం అభిమానులు, జనసేనులు, జనసేన వీరనారీలు వేయికళ్లతో ఎదుచూస్తున్నారు. పవన్ కల్యాణ్ వారాహి వాహనంతో ప్రచారం చేయడంపై నేడు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళగిరి జనసేన కార్యాలయంలో గోదావరి జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. త్వరలో ప్రారంభం కానున్న పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై ఈ సమావేశంలో చర్చించారు. ఏపీలో పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ఇప్పటికే రూట్ మ్యాప్ ను సిద్ధం చేశారు.
జూన్ 14వ తేదీ నుంచి వారాహిపై పవన్ ప్రచార యాత్ర ప్రారంభం అవుతుందని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తొలుత ఉభయ గోదావరి జిల్లాల్లో యాత్ర జరగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలిపారు. ప్రజల సమస్యలను ప్రస్తావించేలా పవన్ యాత్ర జరుగుతుందన్నారు. అన్నవరం నుంచి వారాహి యాత్ర ఆరంభమవుతుంది. యాత్రలో ప్రతిరోజూ ఓ ఫీల్డ్ విజిట్ ఉంటుందని తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో రెండ్రోజులు యాత్ర నిర్వహించేలా షెడ్యూల్ సిద్ధం చేశామన్నారు. త్వరలోనే వారాహి యాత్ర ప్రారంభం కానుండటంతో జనసైనికుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇక 12 రోజుల్లోనే మా నాయకుడు ప్రజల్లోకి వస్తున్నాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Next Story