Mon Dec 23 2024 04:54:40 GMT+0000 (Coordinated Universal Time)
మరింత దుమారం రేపుతున్న అక్బరుద్దీన్ వ్యాఖ్యలు
లౌడ్ స్పీకర్ వివాదానికి తెరలేపిన రాజ్ థాక్రేపై పేరు ప్రస్తావించకుండా అక్బరుద్దీన్ విమర్శలు గుప్పించారు. తాను ఎవరిని చెడ్డవారిగా
ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మరోసారి వివాదాల్లో నిలిచారు. అక్బరుద్దీన్ శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించారు. ఔరంగాబాద్లో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి వద్ద అక్బరుద్దీన్ పుష్ప నివాళి అర్పించారు. రాజ్ థాకరే గురించి మాట్లాడేందుకు తాను ఇక్కడకు రాలేదన్నారు. గుర్తింపు లేని వారి గురించి ఎందుకు మాట్లాడాలని.. స్వంత ఇళ్ల నుంచే పంపించేసిన వారి గురించి ఏం మాట్లాడాలని ప్రశ్నించారు. ఎవరి గురించి భయపడేది లేదన్నారు. అక్బరుద్దీన్ మహారాష్ట్రకు రావడాన్ని శివసేన, బీజేపీలు తప్పుపట్టాయి.
లౌడ్ స్పీకర్ వివాదానికి తెరలేపిన రాజ్ థాక్రేపై పేరు ప్రస్తావించకుండా అక్బరుద్దీన్ విమర్శలు గుప్పించారు. తాను ఎవరిని చెడ్డవారిగా చూపించడానికి ఇక్కడకి రాలేదని ఆయన అన్నారు. కనీసం గుర్తింపు పొందే అర్హతలేని వారికి ఎందుకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కుక్కలు మొరిగితే మొరగనివ్వండి. కుక్కల పని మొరగడమే. సింహాలు తమ దారిన తాము నడుచుకుంటూ వెళ్తాయని అక్బరుద్దీన్ అన్నారు.
అక్బరుద్దీన్ ఔరంగజేబు సమాధిని సందర్శించడం ద్వారా మతవిద్వేషాలను పెంచుతున్నారంటూ శివసేన, బీజేపీలు మండిపడ్డాయి. ఒవైసీ మతపరమైన ఉద్రిక్తతలను రేకెత్తిస్తున్నారని శివసేనకు చెందిన చంద్రకాంత్ ఖైరే ఆరోపించారు. క్రూరమైన మొఘల్ చక్రవర్తి సమాధిని సందర్శించినందుకు అక్బరుద్దీన్ ఒవైసీపై కఠిన చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర నవనిర్మాణ సేన కోరింది. చట్టపరమైన చర్యలు తీసుకోకుంటే ఆయనపై పార్టీ చర్యలు తీసుకుంటుందని ఎంఎన్ఎస్ నేత గజానన్ కాలే అన్నారు. అదేవిధంగా అక్బరుద్ధీన్ ఒవైసీపై దేశద్రోహం కేసు పెట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది.
Next Story