Mon Dec 23 2024 07:51:28 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీలోకి కొండా విశ్వేశ్వర రెడ్డి ? 14న ముహూర్తం ఫిక్స్ ?
బీజేపీ సీనియర్ నేత జితేందర్రెడ్డితో భేటీ అయ్యారు విశ్వేశ్వర్ రెడ్డి. రెండు గంటల పాటు చర్చించారు. అనంతరం జితేందర్రెడ్డితో..
హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.. ఇదే అదునుగా రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.. పార్టీలోకి కీలక నేతలను తీసుకొచ్చే విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సక్సెస్ అవుతున్నారనే చెప్పాలి.. ఇప్పటికే తెలంగాణలోని పలువురు కీలక నేతలు బీజేపీ గూటికి చేశారు. రాష్ట్రంలోని కీలక నేతలంతా బీజేపీవైపు చూస్తున్నారు.. చేవెళ్ల మాజీ ఎంపీ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిశారు. కొంతకాలంగా మహబూబ్ నగర్ జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్రలో బీజీబిజీగా ఉన్న బండి సంజయ్ ని విశ్వేశ్వర్ రెడ్డి కలవడం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.
అంతకుముందు బీజేపీ సీనియర్ నేత జితేందర్రెడ్డితో భేటీ అయ్యారు విశ్వేశ్వర్ రెడ్డి. రెండు గంటల పాటు చర్చించారు. అనంతరం జితేందర్రెడ్డితో కలిసి సంజయ్ వద్దకు వెళ్లి చర్చించారు. రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జీపీ నడ్డా రానున్న సమయంలో పార్టీలో చేరడానికి బండిని కలిసినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలోనూ బీజేపీ నేతలతో పలు సందర్భాల్లో సమావేశం అయ్యారు కొండా విశ్వేశ్వరరెడ్డి.. కాంగ్రెస్కు రాజీనామా చేసిన ఆయన.. మళ్లీ హస్తం పార్టీలో చేరతారనే ప్రచారం సాగింది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే బీజేపీలో చేరేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో హుజూరాబాద్ ఎన్నికల సమయంలో బీజేపీ తరపున పోటీ చేసిన ఈటల రాజేందర్ కు మద్దతుగా బీజేపీని గెలిపించాలని ప్రజలకు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. బీజేపీ నేతలతో సాన్నిహిత్యంగా ఉండటం.. తెలంగాణలో రెండో బలమైన పార్టీగా బీబీజేపీ అవతరిస్తుండడంతో కీలక నేతలంతా బీజేపీలోనే చేరేందుకు మొగ్గుచూపుతున్నారు.
దేశంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారైంది.. దీనికి తోడు తెలంగాణాలో కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గవిభేదాలు ఉండడంతో కాంగ్రెస్ ను ఎవరు పట్టించుకోవడం లేదు.. ఇప్పుడు తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఉండడంతో కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరేందుకు సుముఖత చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. నేడు ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా మహబూబ్ నగర్లో ఏర్పాటు చేయనున్న సమావేశానికి జేపీ నడ్డా హాజరు కాబోతున్నారు.. నడ్డా సమక్షంలో కొండా బీజేపీ కడువా కప్పుకుంటారా? ఇలే ఇదే నెలలో బండి సంజయ్ పాదయాత్ర ముగింపు కార్యక్రమానికి విచ్చేయనున్న అమిత్ షా సమక్షంలో చేరతారా? అన్నది వేచి చూడాల్సిందే..
14న ముహూర్తం ఫిక్స్?
మహబూబ్ నగర్ జిల్లాలోని తుక్కుగూడలో బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవ్వనున్నారు. ఇదే ముహూర్తానికి విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ కొండువా కప్పుకోనున్నారని సమాచారం. విశ్వేశ్వర్ రెడ్డితోపాటు పలువురు మహబూబ్ నగర్ కి చెందిన కీలక నేతలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఒకవేళ కొండా బీజేపీలో చేరితే ఆయన అనుచరులు కూడా బీజేపీ గూటికి చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే మొన్నటిదాక కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న కొండా ఇప్పుడు బీజేపీలో చేరితే రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.. ఇక టీఆర్ ఎస్ కూడా అప్రమత్తమై తమ పార్టీ నాయకులను కాపాడుకునే పరిస్థితులు ఏర్పడనున్నాయి.. మొత్తం మీద కొండా బీజేపీ నేతలను కలవడంతో అన్ని రాజకీయ పార్టీ నేతల్లో ఏం జరుగుతుందోనని ఆసక్తి నెలకొంది.. మరి కొండా బీజేపీలో చేరతారా? లేదా ఇలానే న్యూట్రల్ గా ఉంటారా అనేది వేచిచూడాల్సిందే.
Next Story