రాజధాని చుట్టూ రాజకీయం
ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్గానేఉంటాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.
ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఎవరెప్పుడు ఎలా స్పందిస్తారో అసలు అర్థమే కాదు. ఏపీ రాజకీయాలు ఎప్పుడూ తీవ్రమైన ఆరోపణలు, సంచలనాలతో సాగుతుంటాయి. ఏపీ రాజకీయాలు అంటే ఎత్తుకు పై ఎత్తు వేయడమే. ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యంగా అమరావతి చుట్టూ రాజకీయం రంజుగా మారింది. క్యాపిటల్ రాజధాని విశాఖ, ఎగ్జిక్యూటివ్ రాజధానిగా అమరావతి, లెజిస్లేటివ్ రాజధానిగా కర్నూలును చూస్తున్న జగన్ ప్రభుత్వం.. ఇప్పుడు అమరావతి టార్గెట్‌గా భారీ కార్యక్రమం చేపట్టింది.
సీఆర్డీఏ పరిధిలో 50 వేల 793 మంది మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు. గుంటూరు జిల్లా వెంకటపాలెంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇళ్ల నిర్మాణానికి సీఆర్డీఏ పరిధిలోని 1,402 ఎకరాల్లోని 25 లే అవుట్లు ఏర్పాటు చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు, CRDA ప్రాంతంలో 443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇండ్లనూ లబ్ధిదారులకు అందించారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఇళ్ల పట్టాలు కాదు.. సామాజిక న్యాయ పత్రాలు అంటూ జగన్ కామెంట్ చేయడం వెనుక చాలా అంతరార్థం ఉంది. పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు.. అక్కడ జులై 8 నుంచి ఇండ్ల నిర్మాణాలు చేపడతామంటూ సీఎం జగన్ బహిరంగ సభలో ప్రకటించారు. అయితే కొన్నేళ్లుగా అమరావతి రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాజధాని కోసం భూములు త్యాగం చేశామని, ఇక్కడే రాజధాని ఏర్పాటు చేయాలంటూ రిలీ దీక్షలు, నిరసనలు కొనసాగిస్తున్నారు. దీంతో అమరావతి ప్రాంతంలో జగన్ పార్టీకి మైలేజ్ బాగా తగ్గిపోయిందన్న చర్చలు రాజకీయ వర్గాల్లో జరిగాయి.అందుకే సీఆర్డీఏ పరిధిలో 50 వేల ౭౦౩ మందికి ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అయితే పోయిన ఫేమ్‌ను ఎలా రాబట్టాలో జగన్ ముందే తెలుసు. అందుకే సీఆర్డీఏ పరిధిలో 50 వేల 703 మందికి ఇళ్ల పట్టాలు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక్క ప్రోగ్రామ్ తో ఓటరు నాడిని తనవైపు తిప్పుకునేలా చేసుకోగలిగారంటున్నారు.