Thu Dec 19 2024 19:15:38 GMT+0000 (Coordinated Universal Time)
27 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి.. ఆర్ఎస్ రీ ఎంట్రీ ?
బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు రవి తదితర రాష్ట్ర నాయకులు హైదరాబాద్‌లో పొంగులేటి ఇంటికెళ్లారు.
రామసహాయం సురేందర్ రెడ్డి. వరంగల్ మాజీ ఎంపీగా ఉన్న ఈయన గురించి ఉమ్మడి వరంగల్ జిల్లాల్లోని రాజకీయ నేతలకు పరిచయం అక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న ఆర్ఎస్.. 27 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన పేరు మళ్లీ తెరపైకి రావడంతో.. వరంగల్ కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ మొదలైంది. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీకి తిరిగి తీసుకువచ్చేందుకు కారణం ఈయనే అని అంటున్నారు.
బుధవారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు రవి తదితర రాష్ట్ర నాయకులు హైదరాబాద్‌లో పొంగులేటి ఇంటికెళ్లారు. అక్కడ జరిగిన చర్చల్లో సురేందర్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారని అంటున్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఆర్ఎస్ తిరిగి క్రియాశీల పాత్ర పోషిస్తారనే టాక్ వినిపిస్తోంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన సురేందర్‌రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. డోర్నకల్, మహబూబాబాద్, పాలకుర్తి, వర్ధన్నపేట, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, నర్సంపేట, ములుగు, పరకాల శాసనసభ నియోజకవర్గాల్లో ఇప్పటికీ ఆయన అనుచరులు ఉన్నారు. ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, పొదెం వీరయ్య, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎర్రబెల్లి వరదరాజేశ్వర్‌రావు తదితరులు ఆయన శిష్యులే. 30 ఏళ్ల క్రితం వరంగల్ జిల్లా రాజకీయాలు ఆయన చుట్టూ తిరిగేవి. 1996లో వరంగల్ ఎంపీగా ఓటమి చెందిన తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక వారసులను కూడా ఆయన పరిచయం చేయలేకపోయారు. ఇప్పుడు ఆయన తిరిగి లైమ్ లైట్ లోకి రావడంతో ఇక్కడి పాలిటిక్స్ ఎలాంటి టర్న్ తీసుకుంటాయో అని అందరూ ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు.
Next Story