Fri Dec 20 2024 01:35:54 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ ను కలిసిన సిద్ధూ, డీకే
బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మే 20వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి..
కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ తావరచంద్ గెహ్లాట్ సిద్దరామయ్యను ఆహ్వానించారు. 2023, మే 18న కాంగ్రెస్ నేతలు సీఎల్పీ లీడర్ గా సిద్దరామయ్యను ఎన్నుకున్నారు. అనంతరం రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. కేపీసీసీ కార్యాలయంలో సీఎల్పీ సమావేశం ముగిసిన అనంతరం కాంగ్రెస్ నేతలు రాజ్‌భవన్‌కు వెళ్లారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సంబంధించిన పేపర్లను సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లు గవర్నర్‌కు అందజేశారు. రాష్ట్ర ఇన్చార్జి రణ్‌దీప్ సూర్జేవాలా, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, శాసనమండలి ప్రతిపక్ష నేత బీకే హరిప్రసాద్‌తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా వెళ్లారు.
దీంతో సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ లను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో మే 20వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలు చీఫ్ గెస్టులుగా హాజరుకానున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత నాలుగు రోజుల పాటూ సీఎం కుర్చీ విషయమై తీవ్ర చర్చ జరిగింది. ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం సుదీర్ఘ మంతనాలు జరిపి సీఎంను ప్రకటించింది. కాంగ్రెస్ హైకమాండ్ సిద్దరామయ్యను సీఎంగా, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను ప్రకటించింది.
Next Story