Mon Dec 23 2024 13:35:02 GMT+0000 (Coordinated Universal Time)
TDP : చంద్రబాబు ఆ నిర్ణయం వెనక.. దూరదృష్టి కాక మరేంటి?
తెలంగాణలో పోటీ చేయకూడదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు
తెలంగాణలో పోటీ చేయకూడదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని చాలా ఆలోచించి ఆయన తీసుకున్నట్లు తెలిసింది. తాను స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో జైలులో ఉండటం, ఎన్నికలకు ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉండటం ఒక కారణం కాగా, పొత్తులకు టైం కూడా లేకపోవడం మరొక కారణంగా చెబుతున్నారు. ఒంటరిగా పోటీ చేసినా ఇప్పుడున్న పరిస్థితుల్లో నెగ్గుకు రావడం కష్టమేనని అధినేత ఆలోచన. దీంతో పాటు ప్రచారానికి కూడా తాను వచ్చే అవకాశం లేకపోవడం కూడా తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉండటానికి మెయిన్ రీజన్ అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆయనకు తెలంగాణ ఎన్నికలపై పూర్తి క్లారిటీ ఉండబట్టే ఈ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ ఎన్నికలు...
చంద్రబాబుకు ఇప్పుడు తెలంగాణ ముఖ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడం ప్రధానం. అందుకే జైలు నుంచి విడుదలయిన తర్వాత తెలంగాణ ఎన్నికల్లో రోజులు, సమయం వృధా చేయకూడదని ఆయన భావించారు. ఎటూ అక్కడ కొన్ని సీట్లు మాత్రమే సాధించుకోగలం. దాని వల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదు. అదే ఎఫెర్ట్ ఆంధ్రప్రదేశ్ లో బెటర్ అన్నది చంద్రబాబు భావన. అందుకే ఆయన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకూడదని భావించారు. నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి వారికి నిధులను సమకూర్చడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టతరం అవుతున్న నేపథ్యంలోనే ఈ డెసిషన్ కు వచ్చారంటున్నారు.
ఏపీలో చావో రేవో...
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చంద్రబాబుకు ఈ సారి చావోరేవో. ఈసారి ఓటమి పాలయితే అసలుకే ఎసరస్తుంది. పార్టీ మనుగడ కూడా కష్టమేని ఆయనకు తెలియంది కాదు. లేనిపోని పోకడలకు పోయి తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి పరువు పోగొట్టుకునే కన్నా హుందాగా విరమించుకుంటే బెటర్ అని ఆయన ఈ నిర్ణయానికి వచ్చారు. నిజానికి చంద్రబాబు జైలుకు వెళ్లకుండా ఉండి ఉంటే తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేసేవారు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని అయినా బరిలోకి దిగేవారు. ఖమ్మంలో కొంతకాలం క్రితం జరిగిన బహిరంగ సభలోనూ ఆయన తాము పోటీలో ఉంటామని ప్రకటించారు. మరో సభ కూడా తెలంగాణలో ఉంటుందని ప్రకటించిన తర్వాత అనుకోని రీతిలో ఆయన జైలు పాలయ్యారు.
నడిపే వాడేడీ...?
లోకేష్ కూడా ఇప్పుడు యువగళం పాదయాత్రను తాత్కాలికంగా విరమించారు. మళ్లీ మొదలుపెట్టాల్సి ఉంది. తెలంగాణ ఎన్నికల్లో ఫోకస్ చేయలేరు. అంతేకాకుండా తెలంగాణలో సమర్థులైన నేతలు కూడా ఇప్పుడు పార్టీలో లేరు. కేవలం బాలకృష్ణ మీద ఆధారపడి పార్టీని రంగంలోకి దింపితే నగుబాటు తప్ప మరొకటి ఉండదని ఆయన భావించి తెలంగాణ ఎన్నికలకు దూరంగా ఉ:డాలని నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు బీజేపీ కూడా పొత్తుకు ముందుకు రాకపోవడంతో ఏపీలో రానున్న కాలంలో అలయస్స్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ నుంచి స్వచ్చందంగా తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించాల్సి వచ్చింది.
Next Story