Fri Dec 20 2024 05:24:27 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : ఆయనంటే పిచ్చి... అందుకే మోదీ ఇచ్చే రూట్ మ్యాప్ ప్రకారమే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో ఇక కలిసి ఉండక తప్పేలా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా ఫిక్స్ చేశారు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతో ఇక కలిసి ఉండక తప్పేలా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా ఫిక్స్ చేసి పారేశారు. తెలంగాణ ఎన్నికలు పక్కన పెడితే ఏపీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలవకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటన్న చర్చ జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో మోదీ ఎల్.బి. స్టేడియంలో జరిగిన బీసీ సదస్సులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడారంటే పవన్ లో కూడా గూస్బమ్స్ వచ్చాయని అనుకోవాలి. తనను ఇంతగా అభిమానించే మోదీని కాదని ఆయన ఏపీ ఎన్నికల్లోనూ బయటకు కాలు పెట్టలేరు. మోదీ చూపిన రూట్ మ్యాప్ నే ఆయన ఫాలో అవుతారన్నది చెప్పకనే తెలుస్తుంది.
మోదీ అంటే పవన్ కు...
తొలి నుంచి పవన్ కు నరేంద్ర మోదీ అంటే ప్రత్యేక అభిమానం. ఆయన ప్రసంగాలంటే పవన్ కు పిచ్చి. జనసేన పార్టీ పెట్టకముందే మోదీని వెళ్లి పవన్ కలిసి వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత బీజేపీని వ్యతిరేకించిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత మోదీ ఫ్యాన్ గా మారి ఆయన వెంటే ఉన్నారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో బీఎస్సీ, కమ్యునిస్టులతో పొత్తు పెట్టుకున్నా బీజేపీపై పెద్దగా విమర్శలు చేయలేదు. ఎన్నికలు పూర్తి అయిన వెంటనే తాను ఢిల్లీకి వెళ్లి ఎన్డీఏలో కలిసేందుకు సిద్ధమని ప్రకటించి వచ్చారు. తర్వాత ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. దాదాపు నాలుగేళ్ల నుంచి బీజేపీతో పవన్ ప్రయాణం కొనసాగుతూనే ఉంది.
తెలంగాణలో పోటీపై...
తాజాగా తెలంగాణలో జనసేన పొత్తుపై తొలుత సందేహాలు తలెత్తినా తర్వాత మాత్రం కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. అమిత్ షా సూచన మేరకు తెలంగాణలో పోటీకి పవన్ సిద్ధమయ్యారని సమాచారం. అమిత్ షాను కలసి వచ్చిన తర్వాతనే పవన్ వైఖరిలో మార్పు వచ్చింది. అప్పటి వరకూ తెలంగాణ జనసేన నేతలకు పోటీపై రెండు, మూడు రోజుల్లో ఆలోచించి చెబుతానని ప్రకటించారు. అలాంటిది అమిత్ షా సమావేశం ఆయన నిర్ణయాన్ని మార్చిందనే అనుకోవాలి. మోదీ ఆ మధ్య విశాఖకు వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా పవన్ ను పిలిపించుకుని మాట్లాడటంతో ఆయనపై అభిమానం పెరగడమే కాని తగ్గేది అంటూ లేకపోయింది.
టీడీపీతో కలసి...
ఇప్పుడు ఎల్.బి. స్టేడియంలో అదంరి సమక్షంలో పవన్ తో ప్రధాని నరేంద్ర మోదీ ముచ్చటించడం ఏపీ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీతో కలిసి నడవాలన్నా, లేదన్నా, సీట్లు ఎన్ని కేటాయించాలన్నా అంతా మోదీ ఇష్టప్రకారమే పవన్ వెళ్లే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీ తనకు ఇచ్చిన, ఇస్తున్న ప్రయారిటీని పవన్ కాదనకోలేరు. పైగా పైగా ఎక్కువ ఎమోషనల్ ఫీలయ్యే నేత పవన్ కల్యాణ్. అలాంటిది పవన్ కల్యాణ్ ఇక మోదీ చెప్పినట్లు వెళ్లాల్సిందే. అవి ఏపీ ఎన్నికలైనా.. ఏవైనా సరే. మోదీ ఆదేశించడం అనడం బాగోదు కాని, ఆయన చెప్పిన సలహాలను పాటించి తీరాల్సిన పరిస్థితి పవన్ కల్యాణ్ కు ఈ సభ ద్వారా కలిగిందనే చెప్పాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story