Mon Dec 23 2024 10:45:31 GMT+0000 (Coordinated Universal Time)
Nellore : సస్పెండయిన వారి బాధ ఎవరికి చెప్పుకోవాలి.. ఎటూ కాకుండా పోయినట్లేనా?
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు సమావేశమయ్యారు.
నెల్లూరులో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన ఇద్దరు ఎమ్మెల్యేలు నేడు భేటీ అయ్యారు. వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు సమావేశమయ్యారు. భవిష్యత్ రాజకీయాలపై చర్చించినట్లు తెలిసింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని భావిస్తుంది. పొత్తులో భాగంగా ఆ సీటు ను టీడీపీ జనసేనకు కేటాయిస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీటుకు ఎసరు వస్తుంది. అయితే సాధ్యమయినంత వరకూ కోటంరెడ్డికే ఛాన్స్ ఇచ్చేందుకు చంద్రబాబు చివరి నిమిషం వరకూ ప్రయత్నించే అవకాశాలున్నాయి.
అనుకూల సిగ్నల్స్...
అయితే ఇప్పటి వరకూ చంద్రబాబు నుంచి కోటంరెడ్డికి సానుకూల సంకేతాలు మాత్రం రాలేదు. దీంతో కోటంరెడ్డికి టెన్షన్ పట్టుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటు వేశారన్న కారణంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని, ఆనం రామానారయణరెడ్డిని పార్టీ నుంచి వైసీపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిరువురూ టీడీపీలో చేరారు. లోకేష్ యువగళం పాదయాత్రలోనూ ఇద్దరూ చురుగ్గా పాల్గొన్నారు. కానీ టిక్కెట్ కేటాయింపు వచ్చే సరికి తొలి జాబితాలో వీరి పేర్లు ఉంటాయా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
ఆనం పరిస్థితి...
ణరెడ్డి పరిస్థిితి కూడా అంతే. ఆయన ప్రస్తుతం ఉన్న వెంకటగిరి నుంచి పోటీ చేయడానికి సుముఖంగా లేరు. అదే సమయంలో పాత ఆత్మకూరు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయకూడదని భావిస్తున్నారు. తను చివరి సారిగా నెల్లూరు పట్టణ ఎమ్మెల్యేగా పోటీ చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. అయితే నెల్లూరు టౌన్ నియోజకవర్గంలో ఆల్రెడీ నారాయణ కర్చీఫ్ వేసి కూర్చున్నారు. చంద్రబాబు కూడా ఆయనకే టిక్కెట్ ఖరారు చేయనున్నారు. దీంతో ఆయనకు ఏం చేయాలో పాలుపోవడం లేదంటున్నారు. మొత్తం మీద ఈ ఇద్దరు భేటీ నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.
Next Story