రాజకీయాల కోసం ఇంత దిగజారుతారా?: పేర్ని నాని
రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషం చిమ్ముతున్నారని వైసీపీ నేత పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ: రాష్ట్ర ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషం చిమ్ముతున్నారని వైసీపీ నేత పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పవన్, వాలంటీర్లకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. పవన్ చేసిన వ్యాఖ్యలపై పేర్ని నాని సీరియస్ అయ్యారు. సీఎం వైఎస్ జగన్‌ను ఏకవచనంతో పిలిస్తే.. తాము కూడా అదే రీతిలో సమాధానం ఇస్తామంటూ ఫైర్ అయ్యారు. పవన్‌కు మాత్రమే నోరు ఉందా, తాము కూడా మాట్లాడుతామన్నారు. పవన్ కల్యాణ్.. చంద్రబాబు కాళ్లు మొక్కితే తమకేమి ఇబ్బంది లేదంటూ కౌంటర్ ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థను చూసి చంద్రబాబు, పవన్‌కు భయం పట్టుకుందన్నారు.
సీఎం జగన్ సంక్షేమ పాలనను వీరిద్దరూ ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. అబద్ధాలు చెప్పనంటూనే పవన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. వాలంటీర్లలో ఎక్కువ మంది మహిళలే పనిచేస్తున్నారని, అలాంటి వాలంటీర్లపై ఇంత దిగజారుడు మాటలు మాట్లాడుతారా? అంటూ పేర్ని నాని మండిపడ్డారు. పవన్ మాటలను చూస్తుంటే.. చంద్రబాబుపై హద్దులు లేని ప్రేమ కనిపిస్తోందన్నారు. పవన్ స్పీచ్‌లలో చంద్రబాబు స్క్రిప్ట్‌నే చదువుతున్నారని, ఆధారాలు లేకుండా విషపు లెక్కలు చెబుతున్నాడని అన్నారు. చంద్రబాబుకు లబ్ధి చేకూర్చేందుకే పవన్ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని అన్నారు.
టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబు, పవన్‌కు ఉందా? అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్‌లవి నీచ రాజకీయాలంటూ మండిపడ్డారు. చంద్రబాబు మెప్పు పొందేందుకు పవన్ దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారని, పవన్‌కు ఏ మాత్రం విజ్ఞత ఉన్న వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు. రాజకీయంగా రెచ్చగొట్టేందుకు ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. మీరు మాట్లాడే మాటలు ప్రవచనాలా?, మీకు మాత్రమే వ్యక్తిత్వం ఉంటుందా?, వాలంటీర్లకు వ్యక్తిత్వం ఉండదా? అని పేర్ని నాని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో పవన్ చెప్పాలన్నారు.