Fri Jan 10 2025 08:19:36 GMT+0000 (Coordinated Universal Time)
మీరే కాదు..మేము ఏడిపిస్తాం..టర్కిష్ ఐస్ క్రీమ్ అబ్బాయితో ఈ అమ్మాయి ఎలా ఆడుకుందో చూడండి..
సాధారణంగా ఎవరైనా ఐస్ క్రీమ్ కొనుక్కోవాలంటే.. షాపుకెళ్లో లేదా.. ఐస్ క్రీమ్ స్టాల్స్ వద్దకో వెళ్లి మనకు నచ్చిన ఫ్లేవర్..
టర్కిష్ ఐస్ క్రీమ్.. ఇప్పుడు ప్రతి ఈవెంట్ లోనూ వీళ్ల స్టాల్ ఉంటుంది. మాల్స్, ఎగ్జిబిషన్లు, మేళా లు ఇలా ప్రతి చోట వీళ్లుంటున్నారు. సాధారణంగా ఎవరైనా ఐస్ క్రీమ్ కొనుక్కోవాలంటే.. షాపుకెళ్లో లేదా.. ఐస్ క్రీమ్ స్టాల్స్ వద్దకో వెళ్లి మనకు నచ్చిన ఫ్లేవర్ అడిగితే.. అందుకు తగిన డబ్బు తీసుకుని ఇస్తారు. కానీ.. టర్కిష్ ఐస్ క్రీమ్ వాళ్లు అలా కాదు. ఐస్ క్రీమ్ తినడానికి ముప్పతిప్పలు పెడుతుంటారు. అడిగిన దానిని డైరెక్ట్ గా ఇవ్వరు.
ముందు కోన్ గొట్టంపై ఐస్ క్రీమ్ స్కూప్ పెట్టి ఇస్తున్నట్లు ఇస్తారు. అది తీసుకునేలోపు ఒట్టి స్కూప్ చేతిలో పెడతారు. ఇక ఆ తర్వాత మనకు నీరసమొచ్చే వరకూ ఆడుకుంటారు. ఇలా వాళ్లు పెట్టే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఈమధ్యకాలంలో అయితే ఓ పాపను ఐస్ క్రీమ్ ఇవ్వకుండా ఏడిపించిన వీడియో బాగా వైరల్ అయింది. దానిపై నెటిజన్లు మండిపడ్డారు. అయితే అందరితో ఆడుకున్న ఆ టర్కిష్ ఐస్ క్రీమ్ అబ్బాయిని.. ఓ అమ్మాయి డబ్బులివ్వకుండా పరేషాన్ చేసింది.
ఐస్ క్రీమ్ ఇవ్వడానికి వాళ్లు ఎంత పరేషాన్ చేస్తారో.. అంత పరేషాన్ చేసింది. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతనికి బాగా బుద్ది వచ్చి ఉంటుంది. బాగా చేశావ్ అంటూ.. నెటిజన్లు ఆ అమ్మాయిని మెచ్చుకుంటున్నారు.
Next Story