పుట్టినరోజుకు ఎమ్మెల్యేకు పైసల్ లేవంట పాపం
ఆయన ఒక ఎమ్మెల్యే...సాధారణ ఎమ్మెల్యే కాదు అధికార పార్టీ ఎమ్మెల్యే...ఓ పది తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిపరుడు. పైగా కాసుల పంట పండించే కళాశాలలకు అధిపతి. ఇంత ఉన్న ఈ ఎమ్మెల్యే కాసుల కోసం కక్కుర్తి పడ్డారు. అదీ తన పుట్టినరోజు పండుగ జరుపుకునేందుకు. యాజమాని పుట్టినరోజు సందర్భంగా తన కింద ఉద్యోగులకు ఏవైనా కానుకలు ఇచ్చేవారిని ఇంతకాలం చూశాం. కానీ, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఎమ్మెల్యే మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాడు. తన పుట్టిన రోజు వేడుకలు జరిపేందుకు తన తీగల కృష్ణారెడ్డి కళాశాల అధ్యాపకులు, సిబ్బంది సగం రోజు జీతం ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయి. మరి ఎమ్మెల్యే కమ్ యాజమాని తీగల కృష్ణారెడ్డి ఆదేశాలతోనే ఇచ్చారో లేదా ఆయన మెప్పు పొందేందుకు ప్రిన్సిపల్ అత్యుత్సాహం చూపారో తెలియదు గానీ, కళాశాల అధ్యాపకులకు సగం జీతం కట్ చేస్తున్నట్లు సర్క్యులర్ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.