Mon Dec 15 2025 00:22:51 GMT+0000 (Coordinated Universal Time)
Reels Effect: రైలు పట్టుకుని రీల్స్ కట్ చేస్తే కాళ్ళు కట్
సోషల్ మీడియాలో లైక్స్ కోసం స్టంట్స్ చేసే వారందరికీ

సోషల్ మీడియాలో లైక్స్ కోసం స్టంట్స్ చేసే వారందరికీ ఈ వీడియో ఓ గుణపాఠం లాంటిది. ట్రైన్ ను పట్టుకుని ప్రమాదకరమైన స్టంట్స్ చేసే ఓ యువకుడికి ఊహించని ప్రమాదం జరిగింది. ముంబై యువకుడు ఫర్హత్ ఆజం షేక్ ప్రమాదకరమైన రైలు స్టంట్ చేస్తూ ఒక చేయి, కాలును కోల్పోయాడు. కదులుతున్న లోకల్ ట్రైన్కు పట్టుకుని అతడు చేసిన వీడియో వైరల్ అయింది. ఇటీవల షేక్ తీవ్రంగా గాయపడిన స్థితిలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బందికి దొరికాడు.
మార్చి 7న ఆజం షేక్ స్టంట్ చేశాడు. జూలై 14న సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయింది. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడు.. ఏ ప్రాంతంలో ఉన్నాడని తెలుసుకోవాలని అనుకున్న RPF బృందం ఆ యువకుడి పరిస్థితి చొసి షాక్ అయ్యారు. ఒక కాలు, చేయి పోగొట్టుకున్నట్లు గుర్తించారు. ఏప్రిల్ 14న మస్జిద్ స్టేషన్లో ఇదే విధమైన స్టంట్ కారణంగా అతడికి ఈ పరిస్థితి తలెత్తిందని కుటుంబ సభ్యులు పోలీసు అధికారులకు తెలిపారు.
Next Story

