Mon Dec 23 2024 08:10:47 GMT+0000 (Coordinated Universal Time)
Viral Video : ముద్దు సీన్లకే కాదు.. ఢిల్లీ మెట్రోలో ఫైట్లకూ కొదువలేదు
పబ్లిక్ ప్లేస్ అన్న ఇంగితం లేకుండా ముద్దులు పెట్టుకోవడం.. పోర్న్ వీడియోలు చూస్తూ అసభ్యంగా ప్రవర్తించడం..
ఢిల్లీ మెట్రో.. ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా యువత మెట్రోలో చేస్తున్న అసభ్యకర పనులు ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలిచేందుకు కారణమవుతున్నాయి. పబ్లిక్ ప్లేస్ అన్న ఇంగితం లేకుండా ముద్దులు పెట్టుకోవడం.. పోర్న్ వీడియోలు చూస్తూ అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఘటనలకు చెందిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా.. ఢిల్లీ మెట్రోలో జరిగిన మరో ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిలబడేందుకు కూడా చోటులేని రైలులో ఇద్దరు యువకులు ఫైటింగ్‌కు దిగారు. బూతులు తిట్టుకుంటూ ఎగబడి పిడిగుద్దులతో ఇరగకుమ్మేసుకున్నారు.
వాళ్లిద్దరూ కొట్టుకుంటుంటే కొందరు మనకెందుకులే అని దూరంగా జరగ్గా.. కొందరు ప్రయాణికులు విడదీసే ప్రయత్నం చేశారు. వీరి గొడవకు కారణమేంటో తెలియదు గానీ.. నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. ఢిల్లీ మెట్రోలో వినోదానికి కొదువలేదంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా వైరల్ అయిన వీడియోపై డీఎంఆర్ సీ స్పందించింది. మెట్రోలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు బాధ్యతగా మెలగాలని డిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ సూచించింది. రైలులో ఇలాంటివి ఎవరైనా చూస్తే వెంటనే డీఎంఆర్సీ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరింది.
Next Story