Mon Nov 18 2024 05:53:00 GMT+0000 (Coordinated Universal Time)
ట్రైన్ లో ఎప్పుడైనా పానీపూరి తిన్నారా ?.. ఈ వీడియో చూడండి
పానీపూరి అనగానే అందరికీ నోరూరుతుంది. వర్షాలుపడుతుండగా.. అలా చల్లని సాయంత్రం వెేళలో రోడ్డుపక్కన ఉండే బండి వద్దకెళ్లి ..
సాధారణంగా రైళ్లలో టీ, కాఫీ, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అమ్మేవారు ఉంటారు. అవి ఎక్స్ ప్రెస్ ట్రైన్స్ అయితే.. వాటిలోనే ఒక బోగీని వెండర్స్ కు కేటాయిస్తారు. ఇక లోకల్ ట్రైన్స్ లో అయితే చిరుతిండ్లు కూడా అమ్ముతుంటారు. ఉడికించిన శనగలు, సమోసాలు, బిస్కెట్లు.. రైలు ఆగిన ప్రతి స్టేషన్లో విక్రయదారులు రైలెక్కి తమ వ్యాపారం చూసుకుని తర్వాతి స్టేషన్లో దిగిపోతారు. మళ్లీ మరొక రైలెక్కి వ్యాపారం చేస్తుంటారు. లోకల్ ట్రైన్స్ లో స్నాక్స్ అంటే.. అందరికీ గుర్తొచ్చేవి సమోసాలే. కానీ ఎప్పుడైనా లోకల్ ట్రైన్ లో పానీపూరి అమ్మడం ఎక్కడైనా చూశారా ?
పానీపూరి అనగానే అందరికీ నోరూరుతుంది. వర్షాలుపడుతుండగా.. అలా చల్లని సాయంత్రం వెేళలో రోడ్డుపక్కన ఉండే బండి వద్దకెళ్లి పానీపూరి తింటూ.. ఆస్వాదిస్తుంటారు. కానీ రైలులో పానీపూరి ఎప్పుడైనా తిన్నారా ? అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఓ వ్యక్తి కదులుతున్న రైలులో పానీపూరిలు అమ్ముతుండటాన్ని అదే రైలులో ప్రయాణించేవారు వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. గోల్ గప్పా లవర్స్ కూడా.. ట్రైన్ లో పానీపూరీ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ రైలు సరిగ్గా ఎక్కడ ప్రయాణిస్తుందన్న దానిపై క్లారిటీ లేదు. నెటిజన్లు మాత్రం ముంబై లేదా కోల్ కతాకు చెందినది కావొచ్చని చెబుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోపై ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్ చేస్తున్నారు.
ఒక నెటిజన్.. గోల్ గప్పా అమ్మే వ్యక్తి తెలివితేటలను ప్రశంసించారు. వ్యాపారం చేయడానికి సరైన ట్రాక్ ను ఎంచుకున్నావ్ అని వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అంటే.. కొందరు నెటిజన్లు.. అతను రైలులో గోల్ గప్పాలు అమ్ముతున్నాడని ఒకటికి రెండుసార్లు చూస్తే తప్ప తెలియలేదన్నారు. ఏదేమైనా సదరు వ్యాపారి తెలివి భేష్ అని మెచ్చుకుంటున్నారు.
Next Story