Mon Dec 23 2024 08:37:20 GMT+0000 (Coordinated Universal Time)
మెట్రోలో యువకుడి చెంప పగలగొట్టిన యువతి.. నెటిజన్ల రియాక్షన్ ఇది
ఎవరో ఒకరు రైలులో జరిగే ఘటనలను వీడియోలు, ఫొటోలు తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో.. ప్రయాణికుల వివాదాలకు ఢిల్లీ మెట్రో కేరాఫ్
ఇటీవల కాలంలో ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణికుల కారణంగా జరుగుతున్న కొన్ని ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరో ఒకరు రైలులో జరిగే ఘటనలను వీడియోలు, ఫొటోలు తీసి నెట్టింట పోస్ట్ చేయడంతో.. ప్రయాణికుల వివాదాలకు ఢిల్లీ మెట్రో కేరాఫ్ అడ్రస్ గా మారింది. దాదాపు ప్రతిరోజూ ఢిల్లీ మెట్రోలో జరిగే ఏదొక సంఘటన నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవలే ఇద్దరు వ్యక్తుల పిడిగుద్దుల ఫైట్ వైరల్ అవ్వగా.. తాజాగా.. ఓ యువతి యువకుడి చెంప ఛెళ్లుమనిపించిన వీడియో వైరల్ గా మారింది. యువకుడితో వాగ్వాదానికి దిగిన ఆ యువతి.. అతడి చెంప పగిలేలా కొట్టింది. వారిద్దరి గొడవలో ఇతర ప్రయాణికులు కలుగజేసుకోకుండా చూస్తుండిపోవడం గమనార్హం.
కొందరు మౌనంగా వారిని చూస్తుంటే.. మరికొందరు కనీసం వారివైపుకి ముఖాలు కూడా తిప్పి చూడలేదు. అసలు వీరిద్దరి మధ్య వివాదం ఎందుకు మొదలైందన్నది తెలియరాలేదు కానీ.. వారిద్దరూ పరిచయస్తులేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ అక్కడున్న వారెవరూ స్పందించకపోవడంపై కొందరు నెటిజన్లు విచారం వ్యక్తం చేశారు. అక్కడ యువకుడిని యువతి కొట్టింది కాబట్టి ఎవరూ స్పందించలేదు.. అదే ఆ యువకుడు గనుక ఆమెపై చేయి చేసుకుని ఉంటే మరోలా ఉండేదని, కొట్టింది మహిళ కాబట్టి ఎవరూ స్పందించలేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. నెట్టింట వైరల్గా మారిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
Next Story