Sun Jan 12 2025 13:00:08 GMT+0000 (Coordinated Universal Time)
రాజ్యసభలో నేడు 72 మందికి వీడ్కోలు
రాజ్యసభ లో 72 మంది సభ్యుల పదవీ కాలం త్వరలో పూర్తి కానుంది. రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ రావాల్సి ఉంది
రాజ్యసభ లో 72 మంది సభ్యుల పదవీ కాలం త్వరలో పూర్తి కానుంది. రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ రావాల్సి ఉంది. త్వరలోనే రాజ్యసభ ఎన్నికలు జరిగే అవకాశముంది. ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి సభ్యులు పదవీ విరమణ చేస్తుండటం విశేషం. వీరిలో బీజేపీ, కాంగ్రెస్ తో పాటు దేశంలోని పలు ప్రాంతీయ పార్టీల సభ్యులు ఉన్నారు. మార్చి నుంచి ఒక్కొక్కరి పదవీ కాలం పూర్తవ్వనుంది.
జీరో అవర్, ప్రశ్నోత్తరాలు....
దీంతో నేడు రాజ్యసభ లో ఒకేసారి పదవీ విరమణ చేయనున్న 72 మంది రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు చెప్పనున్నారు. సభ్యులు ఆరేళ్ల కాలంలో వ్యవహరించిన తీరును ప్రస్తావించనున్నారు. దీంతో ఈరోజు రాజ్యసభలో ప్రశ్నోత్తరాలను, జీరో అవర్ ను రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు రద్దు చేశారు. సభ్యులు కూడా తమకు దక్కిన అవకాశంపై ప్రసంగించనున్నారు.
Next Story