Mon Dec 23 2024 08:53:40 GMT+0000 (Coordinated Universal Time)
నేడు అదిరిపోయే మ్యాచ్.. పైగా ఆదివారం
నేడు భారత్ - ఆస్ట్రేలియా మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. చెపాక్ స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోనుంది.
వరల్డ్ కప్కు అసలైన రోజు ఇది. వరల్డ్ కప్ ప్రారంభమై మూడు రోజులు కావస్తుంది. జట్లు విజయం సాధిస్తున్నా, పెద్దగా పస లేదు. ఊహించని విధంగా డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఓటమి పాలు కావడంతో వరల్డ్ కప్లో ఏం జరుగుుతందోనన్న టెన్షన్ అంతా నెలకొంది. న్యూజిలాండ్ చేతిలో చావు దెబ్బతిన్న ఇంగ్లండ్ కోలుకుంటుందా? లేదా అన్నది పక్కన పెడితే ఈరోజు జరగబోయే మ్యాచ్ మీదనే ఆసక్తి నెలకొంది. ఈరోజు భారత్ - ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరగబోతోంది.
తక్కువగా అంచనా...
చెన్నైలోని చెపాక్ స్టేడియం ఇందుకు వేదిక కానుంది. చెపాక్ స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోనుంది. మధ్యాహ్నం రెండు గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియా, భారత్ రెండు బలమైన జట్లుగానే కనిపిస్తున్నాయి. కానీ మైదానంలో కదలికలు, ఆటతీరును బట్టే గెలుపోటములుంటాయి. అందుకే అభిమానుల్లో టెన్షన్. సొంత గడ్డపై ఆడుతుండటంతో టీం ఇండియాలో కొంత కాన్ఫిడెన్స్ ఎక్కువగానే కనపడుతుంది. అయితే అదే సమయంలో ఆస్త్రేలియాను తక్కువగా అంచనా వేయలేని పరిస్థిితి.
ఇరు జట్లు...
వరల్డ్ కప్ కు ముందే ఆస్ట్రేలియాపై సిరీస్ గెలిచిన ఉత్సాహంతో భారత్ ఉంది. అదే సమయంలో భారత్ ను కట్టడి చేయడం పెద్ద కష్టమేమీ కాదన్న విశ్వాసంతో ఆస్ట్రేలియా జట్టుంది. రెండు మేలైన జట్లు. బ్యాటర్లు, బౌలర్లు ఇరు జట్లలో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. సమఉజ్జీలుగా ఉన్న ఇరు జట్లు ఈరోజు తలపడుతుండటంతో సన్ డే క్రికెట్ ఫ్యాన్స్ కు మామూలు టైం పాస్ కాదు. అందుకే ఈరోజు జరిగే మ్యాచ్పై నిర్వాహకులు కూడా భారీగా ఆశలు పెట్టుకున్నారు. ప్రకటనదారులు కూడా పోటీ పడి మరీ ప్రకటనలు ఇచ్చారని తెలిసింది. సో... సన్ డే కదా? ఇక మజా చేసేయండి అంటూ రెండు జగత్ జట్టీలపైన జట్లు మీ ముందుకు వస్తున్నాయి. బీ. రెడీ.
Next Story